వార ఫలాలు 15-10-2023 నుండి 21-10-2023 వరకు

వార ఫలాలు 15-10-2023 నుండి 21-10-2023 వరకు

మేషం: వ్యవహారములు కానీ, సుదీర్ఘ నిర్ణయములు కానీ తొందరగా తీసుకోవడం, చేయాలనుకున్న పనులను జాప్యం చేయకుండా చూసుకోవడం మంచిది. లేదంటే పనులు ఆలస్యం అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈవారం లాభసాటిగా సాగుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడి అని మరచిపోవద్దు. బిజినెస్ ఎక్సపన్సాయిన్ చేసేవారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సానుకూలంగా, నిదానంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మానసిక ధైర్యం ఏర్పరచుకోండి. ముఖ్య వ్యవహారాలలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. 

వారం ద్వితీయార్థంలో నిదానంగా కొనసాగుతుంది, జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. విద్యార్థులకు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. కష్టేఫలి అన్న మాట అర్ధం అవుతుంది. నిర్లక్ష్యం, సోమరితనం మంచిది కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధిక అభివృద్ధి కనబడుతుంది. అయినప్పటికీ ఖర్చులు మాత్రం ఆదాయమునకు మించి కనబడతాయి.  పాత స్నేహితులను  కలుసుకునే అవకాశములు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు.

ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, పెరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది.ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి  టెన్షన్ పడకండి. అనుకున్న  కార్యం సిద్ధిస్తుంది.రాజకీయ రంగంలో వున్నవారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రజలలో ఆర్దరణ పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకుని ముందుకు వెళ్లడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి .


వృషభం: కొంత ఓర్పు సహనం వహిస్తే అన్ని విధాలా అనుకూలమైన ఫలితములు ఉంటాయి. ఉద్యోగస్తులకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలు, శక్తిసామర్ధ్యములతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి ప్రయత్నములు ఫలించే అవకాశములు ఉన్నాయి. శుభ కార్యక్రమముల విషయాలు, వ్యవహారములు ఈ వారం ద్వితీయార్థంలో ఒక కొలిక్కివస్తాయి. అయితే కుటుంబంలో, సంతానంతో చిన్నపాటి అభిప్రాయభేదములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి.  కోపమును నియంత్రించుకోండి.  ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. స్నేహితులతో సాన్నిహిత్యం బాగుంటుంది. 

వ్యాపారస్తులకు ప్రజాదరణ పెరుగుతుంది. లాభాల విషయాలలో బాగున్నప్పటికీ ఎదో తెలియని అలజడి ఉంటుంది. ఎంత కష్టపడ్డా రుణాలు వలన ఇబ్బంది పడతారు. అనుకున్న సమయానికి ధనం చేతికందక పోవడం కూడా మనోవేదనకు గురి చేస్తుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి , టెక్నీకల్ రంగం వారికి కూడా అభివృద్ధి బాగుంటుంది. కొంత శ్రమ ఎక్కువ అయినప్పటికీ అన్ని మంచి అనుకూలమైన ఫలితములను పొందగలరు. ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, వ్యాపారస్తులకు ఈవారం సానుకూలంగా ఉంటుంది. ఆటంకాలు వున్నా అధిగమించి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.  ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి. ఏ విషయమైనా జీవిత భాగస్వామి తో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ రంగంలో వున్నవారికి ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి. టెన్సన్స్ ఎక్కువవుతాయి మీరు నమ్ముకున్న వాళ్ళు వెన్ను పోటు పొడుస్తారు, జాగర్త వహించండి.


మిథునం: అంతవరకు మీతో స్నేహముగా ఉండి మీ మాటకు విలువ ఇచ్చేవారు మీరు ఊహించని విధంగా మారే అవకాశములు ఉన్నాయి.  ఏ విధమైన  రహస్యములు కానీ, వ్యవహారములు కానీ అందరితో చర్చించుకోవడం మంచిది కాదు. జాగ్రత్త  వహించండి. మాట విషయంలో అనుకోని విధమైన పరిణామములు ఎదురవ్వవచ్చు. ఏది ఏమైనప్పటికీ  మీరు మాట్లాడే విధానం, తెలివితేటలు కారణంగా అనుకున్న పనులు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. 

వ్యాపారస్తులకు ప్రతికూల ఫలితాలుండే అవకాశాలున్నాయి. సంతానం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకున్న ఫలితాలుండకపోవచ్చు. అభివృద్ధి నిదానంగా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలు పెట్టేసరికి కొద్దిపాటి అంటంకాలు ఏర్పడతాయి. అలాఅని పనిని ఆపవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఫలితం ఆశించి ఏ పని చేయకండి. ఫలితాలు నిదానంగా ఉంటాయి. విద్యార్థులకు కష్టపడి చదువుకోవాల్సిన సమయం గా చెప్పవచ్చు.  నిర్లక్ష్యం, సోమరితనం మంచిది కాదు.  

శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అయితే మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి. ఈవారం స్త్రీలకు సామాన్యంగా వుంది అని చెప్పవచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత పెద్ద పనయినా మీ ఆలోచన శక్తి తో ముందుకు సాగుతారు. ధన లాభం వాస్తు లాభం వుంది. అయితే పిల్లల పట్ల జాగర్త వహించాలి. రాజకీయ రంగంలో వున్నవారికి జనాధారణ పెరుగుతుంది. అయితే కొందరి వల్ల ఇబ్బందులు ఎదురుకోవసి రావచ్చు జాగర్త వహించండి. ఎత్తులు వేయడంలో మీకు మీరే సాటి కానీ కొన్ని తొందర పటు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.


కర్కాటకం: ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా  సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి బాగుంతుంది. అయితే అభివృద్ధితో పాటు పని ఒత్తిడి పెరుగుతుంది. అధిక ఖర్చు, టెన్సన్స్ ఉండే అవకాశములు ఉన్నాయి. బంధువర్గంలో కొంత ఈర్ష్య, అసూయలు పెరుగుతాయి. లేనిపోని నిందలు, విపరీతమైన ఖర్చులు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే కుటుంబంలో, జీవిత భాగస్వామి నుండి అనుకూలత ఉంటుంది. కుటుంబంలో వారి సహాయ సహకారములు ఉంటాయి. కుటుంబంలో  సంతోషం కొరకు, వారి కోసం చేసే  ఖర్చులు అధికం అవుతాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖర్చులకు వెనుకాడకుండా ఖర్చుపెడతారు. ఆరోగ్య పరముగా కొంత జాగ్రత్త వహించండి. వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణములలో జాగ్రత్త వహించండి.  

విద్యావిషయంలో కొత్త కోర్సులు వంటివి మొదలు పెట్టవలసి వస్తే వారం ప్రథమార్ధంలో మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు కొంత అలసట తగ్గుతుంది. అనుకున్న ఫలితములు సాధిస్తారు. అనుకోని విధంగా బహుమానములు వంటివి అందుకునే అవకాశములు ఉంటాయి. సంతోషంగా గడుపుతారు. స్నేహితుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరం, ఇతరుల విషయములలో జోక్యం మంచిది కాదు. ఈవారం స్త్రీలకు సామాన్యంగా వుంది అని చెప్పవచ్చు, ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు వుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగయం పట్ల జాగర్త వహించండి. నిత్యం  ఖడ్గమాలా స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో వున్నవారికి ఆచి తూచి అడుగులు వేయాలి. చిన్న చిన్న విషయానికి అవమానం ఎదుర్కోవలసి రావచ్చు. జాగర్త వహించండి. ఏది ఏమైనా అలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


సింహం: ఉద్యోగ పరముగా మంచి పేరు, గుర్తింపు లభించే అవకాశములు ఉన్నాయి. ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు, అలాగే నూతన విద్యా,   కోర్సులు వంటి వాటి విషయంలో సరైన నిర్ణయములు తీసుకుంటారు. చదువుతో పాటు టాలెంట్ కి ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాపారస్తులకు అనుకున్న లాభములను పొందగలుగుతారు. ఏపనైనా స్వయంగా చూసుకోవడం వల్ల పురోగతి బాగుంతుంది. నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. క్రయ విక్రయాలు బాగుంటాయి. సంతాన పరంగా సౌఖ్యం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో, జీవిత భాగస్వామితో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

ఒక విధమైన మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యములు విషయములు ఒక కొలిక్కి వస్తాయి. అయితే అన్ని విధముల బాగున్నప్పటికీ ఒక్క విషయంలో జాగ్రత్త వహించండి.  ఏ పని అయినా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చుతో, శ్రమతో అయ్యే అవకాశములు ఉన్నాయి. అవసరమయితే తప్ప ఖర్చు చెయయకపోవడం చెప్పదగిన సూచన. ఈవారం స్త్రీలకు జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశాలు వున్నాయి జాగర్త వహించండి. ఉద్యగ, వ్యాపారాలలో పురోగతి బాగుంతుంది. మీ యొక్క తెలివి తేటలు, సమయస్ఫూర్తితో పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగంలో వున్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కోర్ట్ వ్యహారాలు లభిస్తాయి. పార్టీ మారాలనుకున్న మీ ఆలోచనను ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


కన్య: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమ అధికం అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడిలో ఉండి మీరు మాట్లాడే కఠినమైన మాటలు తర్వాత ఇబ్బందులకు గురి చేయవచ్చు. మాట్లాడేటప్పుడు కొంత నిదానంగా మాట్లాడడం మంచిది. మీరు మంచికి వెళ్తే చెడు ఎదురయ్యినట్లుగా ఉంటుంది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు తాత్కాలిక ఆనందం కలుగుతుంది. లాభములు తక్కువగా ఉన్నప్పటికీ నష్టములు లేనందుకు సంతోష పడతారు. స్నేహములు చేసేటప్పుడు వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయం కంటే వారి వ్యక్తిగత విషయాలు దృష్టిలో ఉంచుకుని స్నేహం కొనసాగించుట మంచిది. స్నేహితులను బట్టే మన గుణగణాలను ఎదుటివారు అంచనా వేస్తారనే విషయం మరచిపోకండి.  ఏదైనా కొత్త వ్యవహారములు, ప్రణాళికలకు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కంగారు పడవద్దు.

విద్యార్థులకు ఇది వినోద పర్యటనలు వంటి వాటికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. చదువు మీద దృష్టి పెట్టనిచో భవిష్యత్తులో అనుకున్న ఫలితాలు అందకపోవచ్చు. వినోద యాత్రలు, విలాసముల వంటి సరదాలతో  పాటు విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు, వ్యాపారస్తులకు  లాభాలు తక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని తెలుసుకుంటారు. ఏది ఏమైనా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఈ వారం మేలు చేస్తాయి. రాజకీయ రంగంలో వున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పని లాభిస్తుంది. మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. మనసు స్థిమితం ఉండదు. ఏ నిర్ణయం అయినా ఆలోచించి తీసుకోవడం చెప్పదగిన సూచన.


తుల: కుటుంబంలోని వారితో, మనం సొంతం అనుకునే వారితో చిన్నపాటి తగాదాలు, విరోధములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి.  అయితే మీకు బాగా సన్నిహితులైన స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి వలన  మాట రూపంలో అయినా సరే సహాయ సహకారములు అందడం  వలన మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ శ్రేయోభిలాషులు, సన్నిహితుల  స్నేహం వదులుకోకండి. అలా అని అందరిని నమ్మడం మంచిది కాదు. మీకు నమ్మకమైన, మిమ్మల్ని అభిమానించే వారి సలహాలు మీకు అనుకూలమైన ఫలితములను ఇస్తాయి. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వృధా ప్రయాస, శ్రమ ఉండే అవకాశములు వున్నాయి అని చెప్పవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయతనం చేయడం మంచిది. విజయ ప్రాప్తి సిద్ధిస్తుంది.

వ్యాపారస్తులకు వ్యాపార లాభం వుంది. అయితే శత్రువర్గం నుండి నష్టములు ఉండవచ్చు జాగ్రత్త వహించండి. వ్యాపార ప్రదేశాలలో ధూపం వేయడం వలన నరదిష్ఠి తొలగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు విద్య యందు దృష్టి మరలకుండా చూసుకోవడం చెప్పదగ్గ సూచన. పట్టుదలతో ముందుకు సాగండి. ఆర్ధికంగా డబ్బు విషయంలో  అనుకున్న పనులు  కొంత నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. చిన్నపాటి జ్వరము కానీ, వాతావరణం మార్పుల వల్ల  వచ్చే సమస్యలు కానీ ఉండే అవకాశములు ఉన్నాయి. ఈవారం స్త్రీలకు అనుకూలంగా వుంది. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది  జాగర్త వహించండి. రాజకీయ రంగంలో వున్నవారికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ లక్ష్యాన్ని చేరడానికి శ్రమిస్తారు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.


వృశ్చికం:  ఏదైనా కొత్త పనులు మొదలు పెడితే జాప్యం చేయకుండా తొందరగా అనుకున్న సమయానికి చేసుకోవడం  మంచిది.  సంతాన పరంగా, గృహమందు సంతోషం లభిస్తుంది. స్నేహితులతో గౌరవం, మానసిక సంతృప్తి లభిస్తుంది. అయితే  వ్యాపారస్తులకు కూడా అన్ని విధముల ఖర్చు కనబడుతుంది. మీరు కష్టపడి పని చేసిన దానికి వేరే వారికి ప్రతిఫలం దక్కుతుంది. అయినప్పటికీ మీరు పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. చిన్నపాటి అవమానములు, అపవాదులు ఉండే అవకాశములు ఉన్నాయి. స్నేహితుల వలన సహాయ సహకారములు లభిస్తాయి. ఉద్యోగాభివృద్ది తప్పక ఉంటుంది. మానసిక వత్తిడి ఎక్కువవుతుంది. ప్రణాళిక పద్దతిలో వెళ్ళండి విజయం సిద్ధిస్తుంది. 

విద్యార్థిని విద్యార్థులకు కొంత విశ్రాంతి దొరికే సమయం అని చెప్పవచ్చు. ప్రశాంతముగా ముందుకు సాగండి. మంచి ఫలితాలు వెన్నంటే ఉంటాయి. ఆరోగ్య పరముగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణములలో జాగ్రత్త వహించడం చెప్పదగ్గ సూచన. ఈవారం స్త్రీలకు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత జాగర్త వహించండి. రాజకీయ రంగంలో వున్నవారికి ఆరోగ్య పరమైన జాగర్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయాన్నీ అలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది.


ధనస్సు: ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి, బదిలీలు వంటి విషయములో  అనుకూలమైన ఫలితములు  గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు  చేయండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూసంబంధమైన వ్యాపారస్తులకు మంచి  లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనే  కోరిక సిద్ధిస్తుంది. అలాగే సాఫ్ట్ వేర్ రంగం  వారికి కూడా మంచి సమయం, ఉద్యోగంలో వృద్ధి, మనశ్శాంతి లభిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ పరంగా కూడా సంతోషములు చోటు చేసుకుంటాయి. బంధువులతో కలయిక ఉంటుంది. 

నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి. నూతన గృహం కొనాలనుకునేవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ధైర్యం చేసి ముందు అడుగు వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు కానీ,  వివాహము కానీ వారికి వివాహ ప్రయత్నములు చేసే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలుంటాయి.  విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం, అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులు గా అయ్యే సమయం అని చెప్పవచ్చు.  తెలివితేటలతో,  శ్రేయోభిలాషుల సహాయ సహకారములతో మంచి నిర్ణయములు తీసుకోండి. హడావిడిగా  నిర్ణయములు తీసుకోవద్దు.  ఆరోగ్యం బాగుంటుంది. ఇదివరకు ఉండే  అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. 

ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. నూతన గృహంకి అడ్వాన్స్ ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో వున్నవారికి ఈవారం బాగుంది అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ ఆలోచన విధం ఎవరికీ అర్థం కాదు. కానీ మనం అందరికి మేలు చేయాలన్న మీ సంకల్పం మంచి చేస్తుంది.


మకరం: డబ్బులు మంచినీళ్లలా ఖర్చు అవుతుంది. ఉద్యోగస్తులకు వారం చివరలో కొంత ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత కొరకు పరితపిస్తుంటారు. తెలియని ఆందోళనలు మిమ్మలిని ఇబ్బంది పెడతాయి. వ్యవహారములు పట్ల కొంత ఇబ్బందులు తప్పవు, అనుకున్న వెంటనే పనులు పూర్తవ్వడం కష్టంగా మారుతుంది. ఆలస్యంగా ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. కఠినంగా మాట్లాడడం మంచిది కాదు. జాగర్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. చిన్నపాటి జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశములు ఉన్నాయి.  ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం పట్టుదలకు పోవడం మంచిది కాదు. ప్రశాంతముగా అలోచించి నిర్ణయములు తీసుకోండి. 

వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు వంటివి అంత మంచిది కాదు.  ప్రస్తుత గ్రహ గతులను బట్టి స్థాన చలనం అంత మంచిది కాదు. కంగారు పడకండి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడితే అనుకున్న ఫలితములు సాధించగలుగుతారు. కష్టమునకు తగిన ఫలితం మాత్రం  లభిస్తుంది. అదృష్టం  కలసిరావడం అనేది ఆశించకండి. ఈవారం స్త్రీలకు  కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి.  ఏ పని చేసిన నిదానంగా సాగుతుంది. ఉద్యోగములు విషయాల యందు జాగ్రత్త వహించండి.  వ్యాపారస్తులకు ఈవారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు  తక్కువగా ఉంటుంది. అయితే మీ నమ్మకాన్ని వదలకుండా పని చేస్తారు. దాని వాళ్ళ మంచి ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలో వున్నవారికి చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. చేయని తప్పుకు నింద పడవలసి రావచ్చు. ఆరోగయం పట్ల జాగర్త వహించాలి.


కుంభం: ఉద్యోగస్తులకు వృధా తిరుగుడు ఉండే అవకాశములు ఉన్నాయి. వృధా ప్రయాణములు, వాటివల్ల వచ్చే ఆందోళనలు ఇబ్బంది పడవచ్చు.   పైఅధికారుల వలన పని ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.  జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించాలి. ఖర్చులు అధికం అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. ఏదైనా పనులు వ్యవహాములు పట్ల అశ్రద్ధ చేయకుండా వెంటనే అమలు చేసుకోవడం మంచిది. వారం ప్రథమార్ధంలో అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే అతికష్టం మీద పనులు నెరవేరుతాయి, అనుకున్నదాని కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 

సంతాన పరంగా  ఆనందం లభిస్తుంది. మీరు ఎంత మానసిక ఒత్తిడికి గురి అయినప్పటికీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం మంచిది.  ఇప్పుడు చదువుకోవడం వలన భవిష్యత్తులో అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈవారం స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు, కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. వ్యాపారస్తులకు ఈవారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు  తక్కువగా ఉంటుంది. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని  గరహించండి.  రాజకీయ రంగంలో వున్నవారికి ఈ వరం బాగుంది అని చెప్పవచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం కలుగుతుంది. ఏ నిర్ణయమయిన మిత్రులతో చర్చించి సలహాలు తీసుకోవడం మంచిది.


మీనం: ఉద్యోగ పరంగా అధికారుల తో చిన్నపాటి ఇబ్బందులు, పని ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అనుకోని  ప్రయాణములు  ఉండే అవకాశములు ఉన్నాయి. కుటుంబంలో అశాంతి మిమ్మల్ని ఆందోళన పరిచేదిగా ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు వారు అడిగే కోరికలు వంటివి మీ ఆర్ధిక ఇబ్బందులకు కారణం అవ్వవచ్చు. మీకు రావలసిన డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం వలన ఇబ్బందులు  తద్వారా ఫ్రస్ట్రేషన్ వంటివి ఏర్పడతాయి. అయినప్పటికీ మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు. 

వారం ద్వితీయార్థంలో మీరు అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందడం పాత బాకీలు ఏమైనా ఉంటె అవి చెల్లిస్తారు. ఇతరుల వ్యహారాల విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. ఎవరికీ సలహాలు ఇవ్వడం శ్రేస్కారం కాదు.  వాహనములు నడిపేటప్పుడు జాగ్రత వహించండి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు చిన్నపాటి సవాళ్లు ఉంటాయి ధైర్యంగా ఎదుర్కొంటారు, ఆర్ధికంగా అభివృద్ధి, లాభాలు ఉంటాయి. మీకున్న ధైరం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, విజయం సిద్ధిస్తుంది. 

విద్యార్థులకు  విద్య  పట్ల శ్రద్ద వహించి , దృష్టి మరలకుండా చూసుకోండి. కల్చులర్  అక్టీవిటీస్ వంటివాటిలో అభివృద్ధి ఉంటుంది. 

ఈవారం స్త్రీలకు వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగస్తులకు  మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి.  సంతాన అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహం కానీ వారికీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో వున్నవారికి ఆర్థిక విషయాలలో జాగర్త వహించాలి. మీరు నమ్ముకున్న సిద్ధాంతం కలసి వస్తుంది. అయితే నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారన్న భాద ఎక్కువుతుంది. ఏ నిర్ణయం అయినా ఆలోచించి తీసుకోవడం వలన మేలు జరుగుతుంది.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121