వార ఫలాలు 25-02-2024 నుండి 02-03-2024 వరకు

వార ఫలాలు 25-02-2024 నుండి 02-03-2024 వరకు

మేషం: ఈ వారం మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉహించని విధంగా ధనం అధిక మొత్తంలో అందుతుంది. కొనుగోలు, అమ్మకాలు లాభిస్తాయి. కొంత మేర అప్పులు తీరుస్తారు, మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అన్న భాద వెంటాడుతుంది. మీ మాటలు అందరికి నచ్చవు, నిజాయితీగా మాట్లాడితే తప్పవుతుంది, మనకెందుకులే అని మీ పని మీరు చేసుకోవడం మంచిది, సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి పురోగతి బాగుంటుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఇష్ట దైవారాధన చేయడం మంచిది. నిత్యం గణపతి స్తోత్రం పఠించండి, మొండి బకాయలు ఉంటే వసూళ్ళు అవుతాయి. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మీ భవిష్యత్తుకు మంచి పునాది అనుకోండి. 

వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఆశించిన లాభాలు వస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో వారికీ అంత అనుకూలమైన ఫలితాలు రావు. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అయితే కష్టం మీది లాభాలు వేరొకరికి అన్నట్టుగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. క్రీడా రంగం వారికీ బాగుంది. విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న మార్పులు సానుకూలపడతాయి. పరీక్షలు మొదలవుతున్నాయి, స్ట్రెస్ కి గురికాకుండా జాగర్త పడాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిత్రులతో  వైరం పెరుగుతుంది. మీరు చేయి అందించిన వారే మీకు వ్యతిరేకం అవుతారు. ప్రణాళిక బద్ధతితో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలుంటాయి.


వృషభం: వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విదేశాలలో ఉన్న వ్యక్తుల నుండి సహాయ సాకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కొంత కాలం వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో కొందరి ఆరోగ్య విషయంలో జాగర్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగర్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేయకండి. ఇష్ట దైవారాధన చేయడం వలన మేలు జరుగుతుంది. షేర్లు, చిట్ ఫండ్లు, మొదలైనవి లాభించవు. ఈ వారం నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆచితూచి అడుగులు వేయండి.  కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉన్నా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థల మార్పిడి, ప్రమోషన్స్ సూచిస్తున్నాయి. మేధా దక్షిణామూర్తి రూపు మేడలో ధరించండి, అధికారులతో, సహోద్యోగులతో ఇష్టం లేకపోయినా స్నేహ భావంతో మెలుగుతారు. లేనిపోని చికాకులు ఎందుకు అనే భావనతో సన్నిహితంగా ఉంటారు. 

శుభకార్యాలలో పాల్గొంటారు. సమయానికి ఆహారం తీసుకోవడం  మంచిది. సంస్థలో మీరు ఆశించిన మార్పును పొందగలుగుతారు. వ్యాపారంలో పురోగతి బాగుంటుంది. ఆర్థిక  వ్యవహారాలు లభిస్తాయి. ఋణ సంబంధమైన చికాకులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. రాబోయే కాలం అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది, నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు అమలు చేయడానికి మంచి కాలం అని చెప్పవచ్చు. వివాహం కానీ వారికి వివాహ సంబంధం  కుదురుతుంది. వధూవరుల జాతకపరిశీలన చేసుకొని వివాహ పరంగా ముందుకు వెళ్ళడం మంచిదని సూచన. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు అధికవుతాయి. రాజకీయ రంగంలోని వారికి అవకాశము, అధికారము వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి, నూతన వాహనం ప్రాప్తి ఉన్నది. మొత్తం మీద ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.


మిథునం: వారికి ఈ వారం మీ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగర్తగా ఉండాలి. వారి వల్లన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అంతులేని ఆలోచనలతో మీ మనస్సును ఆందోళనకు గురి కాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరమైన వాటి మీద దృష్టి పెట్టండి. ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. మీరు చేయాలి అనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేయండి. వాయిదా పద్దతుల జోలికి వెళ్ళవద్దు. విద్య ఉద్యోగ సంబంధిత విషయాలపై దరఖాస్తు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  కుటుంబ సభ్యులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తోడుంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా పనులు సానుకూలపడతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కాంట్రాక్టులు, ప్రభుత్వ పరమైన ఆర్డర్స్ వస్తాయి. ఎప్పటినుండో ఉన్న పెండింగ్ బిల్స్ వస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తుల సహాయ సహకారాలు లాభిస్తాయి.   

బిజినెస్ ఎక్సపెన్షన్ చేసే ప్రయత్నం ముందుకు సాగుతుంది. వ్యాపార లావాదేవీల యందు జాగర్తలు పాటించడం ముఖ్యం. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సోదరి సహోదర మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. కళా, సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.  ఆహరం పట్ల జాగర్తలు తీసుకోవాలి, ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కుదురుతుంది. మీరు ధైర్యంతో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు లాభం చేకూరుస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. సభలకు, సమావేశాలకు, ఆహ్వానాలు అందుకుంటారు. వ్యక్తిగత సంభాషణల ద్వారా, ప్రత్యర్థుల రహస్య కార్యకలాపాలు బయట పడతాయి. చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. విద్యా రంగంలో ఉన్న వారికి శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. అమ్మకాలు, కొనుగోలు లావాదేవీలలో జాగర్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


కర్కాటకం: వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సమానంగా లేకపోయినా ఈ ఇబ్బంది లేకుండా అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. ఖర్చు మీ అంచనాలకు మించకుండా చూసుకోవాలి. ఎంత చెట్టుకు అంత గాలి అనే సామెతను బేరీజు వేసుకొని,  స్తోమతిని బట్టి ఖర్చు చేసుకోవడం మంచిది. అదే మీకు ఆర్ధికాభివృద్ధి కలిగిస్తుంది. అష్టమ శని నడుస్తున్నందున కొన్ని పనులకు ఆటంకాలు వస్తాయి. వాటిని జాగర్తగా అధిగమించండి. వృతి పరమైన జాగర్త చర్యలు పాటించండి. బాధ్యతలను అశ్రద్ధ చేయవలసి వస్తుంది. దీని వలన అధికారుల నుండి మాట పడకుండా ముందు జాగర్తలు పాఠించండి. దైవ దర్శనాలు చేస్తారు. విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. టెండర్లు అతి కష్టం మీద మీకు అనుకూలంగా వస్తాయి. 

విశ్రాంతి విరామం లేకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తారు, దాని వలన అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నిదానంగానైనా ముందుకు సాగుతాయి, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి. గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, అన్నప్రాసన, బారసాల వంటి  మొదలైన శుభకార్యాలు వాటికీ ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. సోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. రాజకీయ పరమైన చిక్కులు మీకు ఎక్కువ అవుతాయి. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కానీ పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విషయానైనా ఒకటికి నాలుగు సార్లు అలోచించి, మిత్రుల సలహాలు తీసుకుని వెళ్లడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది.


సింహం: వారికి ఈ వారం వృత్తి పరమైన అభివృద్ధి విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరు ఆశించిన మేరకు అందక పోవచ్చు. భార్య భర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువవుతాయి, అవి తార స్థాయికి చేరుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగర్త వహించండి. ఎక్కువ మాట్లాడకుండా అవసరానికి మించి కాకుండా, కొంత మేరకు మౌనంగా ఉండడం మంచిదని సూచన. ఒక్కోసారి చేయని తప్పుకు కూడా నింద పడతారు. ఆరోగ్యపరమైన జాగర్తలు వహించండి. రావాలసిన ధనం అనుకున్న సమయంలో రాదు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, వివాహం కుదురుతుంది. అయితే వివాహం కుదిరినప్పటికీ వివాహం లేటుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వివాహానికి ముందు వధూవరుల జాతక పరిశీలన ముఖ్యమని గ్రహించండి. వ్యాపార పరంగా బాగుంటుంది, లాభాలు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ నష్టం లేకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, సినీ, కళా రంగం, బ్యూటీ పార్లోర్ వారికీ అనుకూలం అని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు, బంగారం(సువర్ణం) వ్యాపారస్తులకు మధ్యస్తంగా వ్యాపారం ఉంటుంది. నూతన వ్యాపార విషయాలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. వాహన కొనుగోలు చేస్తారు, విహార యాత్రలు చేస్తారు, మీరు ఒకప్పుడు సహాయం చేసినవారు అవసరానికి ఆదుకుంటారు. శుభకార్యాలు చేస్తారు.  రాజకీయ రంగంలోని వారికీ ప్రజాధారణ లభిస్తుంది. ముఖ్య వ్యవహారాలలో అత్యంత సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మీ ఉన్నతికి  చేటుని తెస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ఒత్తిడికి లోనుకాకుండా జాగర్తలు తీసుకోవాలి. ఒక ప్రణాళికా బద్దంగా అభ్యసిస్తే మంచి ఫలితాలను పొందేటందుకు అవకాశాలు ఉంటాయి.


కన్య: వారికి ఈ వారం వృత్తి పరంగా మార్పులు ఉండవచ్చు,  మీరనుకున్న చిన్న చిన్న పనులను పదే పదే చేయవలసి వస్తుంది. ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నా కూడా ఒక విధమైన ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది, ముఖ్యంగా బంధువులతో విరోధాలు రాకుండా జాగర్తలు తీసుకోండి, స్థిరాస్తి విషయంలో ఒక అభిప్రాయానికి వస్తారు.  ప్రమోషన్స్ చేతి దాక వచ్చి చేజారిపోతుంది. వివాహ సంబంధమైన విషయాలు కొలిక్కి వస్తాయి, వివాహం కానీ వారికి వివాహం కుదురుతుంది. అలంకరణ, వస్తువులకు, విలాసవంతమైన వాటికోసం అధిక ధనం ఖర్చు చేస్తారు. ఏ కార్యక్రమంను తపెట్టినా అలోచించి నిర్ణయాలను తీసుకోండి, చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు చేపట్టిన కార్యక్రమాలను విజయంతంగా పూర్తి చేయగలుగుతారు.

ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి, ఏ చిన్న విషయానైనా అశ్రద్ధ చేయకండి, సంతాన పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. వారు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయతిస్తున్నవారికి ఉద్యోగం అతి కష్టం మీద వస్తుంది. విలాసాల కోసం ధనం ఎక్కువ ఖర్చుచేస్తారు, అవసరానికి మించి చేయకుండా ఉండటానికి  ప్రయత్నించండి. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు సైతం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది.  సాఫ్ట్ వేర్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి  కూడా  అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  ఎంతో కొంత సాధించామన్న తృప్తి లభిస్తుంది. కొత్త కాంట్రాక్ట్స్, ఏదైనా కొత్త వ్యాపారం చేయుటకు అనుకూలం అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు, మీ యొక్క తెలివి తేటల వలన మంచి పురోగతి సాధించగలుగుతారు. ప్రజాభిమానం ఏర్పడుతుంది. అనుకోని విధంగా ఒక శుభవార్త వింటారు.


తుల: వారికి ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు, భూ, గృహ సంబంధిత విషయములో లాభం చేకురుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. దీని వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య పరమైన విషయాల్లో జాగర్తలు తీసుకోవాలి. క్రమబద్దమైన ఆహార అలవాట్లు చేసుకోవడం ఉత్తమం. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆత్మ విశ్వాసంతో మరింత ముందుకు సాగుతారు. వృత్తి పరంగా సమయ స్ఫూర్తి అవసరం. కార్యాయంలో చిన్న చిన్న మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డ ఫలితం రావడం లేదు అనే భావనకు వస్తారు, అయితే కొంత ఆలస్యమైనా రావలసిన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవెరితోనైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడడం అవసరం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. 

వ్యాపార పరంగా బాగుంటుంది, పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. ఎంతోకాలంగా వస్తాయని  అనుకున్న కొత్త ప్రాజెక్టులు కొన్ని వస్తాయి. కొన్ని పెండింగులో ఉంటాయి, ఏదైతేనేం ముందు కొంత పని వచ్చింది అనుకుని సర్డుకుపోతారు. రేపటి భవిష్యత్తు కోసం కార్యాచరణ సిద్దమవుతారు. భాగస్వామి వ్యాపారాలలో ఆటంకాలు ఉంటాయి. నేను అన్నీ దగ్గరుండి చూసుంటే బాగుండేది అనే భావన ఏర్పడుతుంది. విదేశీ సంబందించిన వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి పోటితత్వం అలవర్చుకోవాలి. తద్వారా చదువులో ముందు ఉండాలనే మీ ఆలోచన ఆచరణలోకి వస్తుంది. మంచి ఫలితాలను అందుకుంటారు.


వృశ్చికం: వారికి ఈ వారం వృత్తి వ్యాపార విషయాలు బాగున్నాయి. విదేశీ సంబందించిన  ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పనుల యందు శ్రద్ధ చూపిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. రావాలసిన ధనం చేతి కందుతుంది.  జీవిత భాగస్వామి లేదా మీ ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి. మీరు బాగా కష్టపడుతున్నారు అని పొగడ్తలతో ముంచే వారున్నారు. పొగడ్తలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. పొగడ్తలకి పొంగిపోకుండా మీ పని మీరు ఎదావిధిగాచేసుకుపోవడం శ్రేయస్కరం.  గృహ నిర్మాణ, అలంకార సామాగ్రి, విలువైన వస్తువులు కోసం అధిక ఖర్చును గత్యంతరము లేని స్థితిలో ఆమోదిస్తారు. వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అయితే పని యందు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అనుకోని మిత్రులతో సమావేశాలు జరుపుతారు. అయితే మీకు ఒకప్పుడు సహాయం చేసినవాళ్ళని పక్కన పెడతారు. మనకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేశారన్న విషయాన్నీ కూడా మరచిపోతారు. చెప్పుడు మాటలు విని దూరం చేసుకునే అవకాశం ఉంది జాగర్త వహించండి. ఎవరు మనవాళ్ళో ఎవరు మనవాళ్ళు కాదో మీరే నిర్ణయంచుకోవాలి. తన మన బేధం పక్కదారి పట్టించే అవకాశం ఉంది.

అర్ధాష్టమ శని నడుస్తోంది, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు దానం ఇవ్వండి మంచి ఫలితాలుంటాయి. (ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు రాబోవు శని త్రయోదశి నాడు తప్పని సరిగా దోష నివారణ చేసుకోవడం మంచిది.) వివాహం పరంగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకప్పుడు మీ సంబంధం వద్దు అనుకున్నవాళ్ళే మళ్ళీ మీతో సంబంధం కలుపుకోవాలని అడగడం సంతోషకరంగా  అనిపిస్తుంది. వివాహం ఖర్చుల కోసం రావాల్సిన ధనం చేతి కందుతుంది. అయితే ప్రతి విషయానికి మీ మీద ఆధారపడే వారి వలన అలాగే స్వతంత్ర నిర్ణయాలు చేయలేని వారి వలన మీకు చికాకు ఏర్పుడుతుంది. ఆర్థికపరమైన సర్దుబాటును అద్భుతంగా చేయగలుగుతారు. కళా, రాజకీయ రంగంలోని వారికి కొంత చేదు అనుభవం ఎదురవుతుంది. మీరు తెలుసుకున్న సమాచారంలో పొరపాటు జరిగి అవతలి వారిని అపార్థము చేసుకోవచ్చు. ఏది ఏమైనా అన్ని తెలుసుకుని వ్యవహరించడం చెప్పదగిన సూచన.


ధనస్సు: వారికి ఈ వారం బాగుంది. వృత్తిలోని వారికీ విశేష ఆదరణ, గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇంక్రెమెంట్స్, ప్రొమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కలసి వచ్చే కాలం అని చెప్పవచ్చు సద్వినియోగం చేసుకోండి. స్థిరాస్తి అమ్మకం విషయంలో ఆలస్యం అవుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. భాగస్వామి వ్యాపారాలలో చిక్కులు ఉంటాయి. భూ, గృహము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నత్త నడకన నడుస్తాయి. సినీ కళా రంగం వారికీ అనుకూలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి.  ప్రయాణాలు లాభిస్తాయి. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, బంధువులలో కానీ కలహాలు పెట్టెవాళ్ళ వల్ల ఇబ్బందులు, నష్టం ఎదురవుతాయి. మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఇలాంటి సమయంలో మానసిక దృడంతో, మీ తెలివితేటలతో చాకచక్యంగా వ్యవహరించాలి.  లేకపోతె చిక్కులు పడే అవకాశాలు ఉన్నాయి. 

దైవ దర్శనాలు చేస్తారు. వివాహ సంబంధమైన విషయంలో జోక్యం చేసుకోక పోవడం మంచిది. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రేమ సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు తలక్రిందులు అవుతాయి. గతంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యవహారాలు వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఓర్పు సహనం చాల అవసరం ఈవారం. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని అనుకున్నవారికి భంగపాటు తప్పదు. ఏదైనా భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నాలు కొనసాగించండి. అంతా మేలు జరుగుతుంది.  ఈ రాశి వారు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. విద్యార్ధులకు ఈ వారం విద్య మీద కొంత ఏకాగ్రత లోపిస్తుంది. ఎంత చదివినా పెదాలను దాటి బుర్రలోకి, మనసులోకి సిలబస్ ఎక్కదు. జరగబోయే పరీక్షలకు ఇప్పటినుండే మీకు పరిక్షకాలం ఎదురవుతుంది. 


మకరం: వారికి ఈ వారం ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో చికాకు కలిగిస్తాయి. ఇల్లు కొనాలనుకున్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. మిత్రుల సలహాలు సూచనలు మీకు లభిస్తాయి. వృత్తి విషయాలలో జాగర్తలు అవసరం ఏలినాటి శని నడుస్తుంన్నందు వలన ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి, విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరంగా  చిన్న చిన్న అభిప్రాయభేదములు వచ్చినప్పటికీ తరువాత అవి సద్దుకుంటాయి. ఆందోళన చెందకండి. చంచల మనస్తత్వంతో ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క మనసును అధీనంలో ఉంచుకుంటే అన్ని శుభ ఫలితాలుంటాయి. 

అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఆదాయాభివృద్ది ఉంటుంది. వ్యాపారస్తులకు, కళారంగం వారికి, సినిమా రంగం వారికి కూడా అభివృద్ధి కనబడుతుంది. మంచి అవకాశాలు వచ్చే సమయం అని చెప్పవచ్చు.  సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలుండే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలలో  విజయం సాధిస్తారు. ఆరోగ్య పరంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లైతే మరింత  జాగ్రత్త వహించండి. ఆరోగ్య నియమాలు పాటించండి. ఆహార క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. అదేవిధంగా జీవిత బాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. సమస్యలు వచ్చి మీద పడినా ఆత్మస్తైర్యంతో  అధిగమిస్తారు. సంఘములో గౌరవానికి లోటు ఉండదు. ముఖ్యమైన వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు. ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది.


కుంభం: వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా బాగుటుంది.  ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు సానుకూల పడతాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. సంతాన పురోగతి బాగున్నప్పటికీ వారి ప్రవర్తన వల్ల చికాకు ఏర్పడుతుది. సంతాన విద్యా విషయం పట్ల జాగర్త వహించండి. నూతన గృహం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అధికారులు ప్రతి చిన్న విషయానికి మీ మీద ఆధారపడతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. వీసా, గ్రీన్ కార్డు వంటివి లాభిస్తాయి. కొత్త అవకాశాలు కలసి వస్తాయి. వ్యాపార విషయాలు, భాగస్వాముల విషయంలో అతి నమ్మక నిర్లక్ష్యం పనికిరాదు. భాగస్వామి వ్యాపారాలు అంతగా కలసిరావు. సొంతంగా చేస్కునే వ్యాపారాలు లాభ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల జోక్యం పనికిరాదు. 

ఇతర విషయాలపై ఉన్న శ్రద్ధ మీ వ్యాపారం మీద కూడా ఉంటే బాగుంటుంది. కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు. అవి అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు కానీ ఆశించిన ఫలితాలు రాక నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి.  మనం నమ్ముకున్న వాళ్ళను మోసం చేసాం అన్న భాద వెంటాడుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. వివాహం కానివారికి వివాహం కొంత ఆలస్యమవుతుంది. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి మంచి సంబంధం కుదురుతుంది. రాజకీయ పరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. జనంలో మంచి ఆదరణ పెరుగుతుంది. అవి చూసి మనకి మేలు జరుగుతుంది అనుకోవడం పొరపాటు. కష్టేఫలి అన్న సామెత వరిస్తుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది.


మీనం: వారికి ఈ వారం ఉద్యోగస్తులకు ఆర్థిక పరమైన అంశాలు కొంత మేర ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు సంభవించవచ్చు. కళా, సినీ రంగం వారికీ పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. సంఘములో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే అప్పుల బాధ తప్పదు. ఋణాలు తీసుకోక పోవడం మంచిది. అవి చెల్లించే విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. h1b  కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతయి. వ్యాపారస్తులకు వ్యాపారమైనా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు అభివృద్ధి కోసం చేసే కృషిని చూసి ఓర్వలేని వాళ్ళుంటారు. ఎవరు ఏమి అనుకున్న నిరంతర శ్రమతో, పట్టుదలతో సాగండి. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనే ధోరణికి వస్తారు. ధైర్యమే మీ పెట్టుబడి అని మరచిపోకండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారంలో పలు మార్పులు చేయడం ద్వారా లబ్ది పొందుతారు. ఆర్థిక స్థితి బాగుటుంది. మీకు రావలసిన ధనం మీ చేతికి అందుతుంది. నూతన వ్యక్తులతో, పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. 

కుటుంబంలో సఖ్యత కోసం ఎక్కువ శ్రమించ వలసి వస్తుంది. మీ పై చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మంచిది. విదేశీ సంభందిత విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఏలిన నాటి శని నడుస్తుంది కావున శని జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అపోహలకు తావు ఇవ్వకుండా మానసికంగా ఆలోచించి మీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీని  కరెక్ట్ వే లో పెట్టడం వలన మంచి ఫలితాలను పొందగలరు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీరు ఊహించిన విధంగా మార్పులు చేస్తారు అవి సానుకూల పడతాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు వారి పట్ల జాగర్త వహించండి. అందరిని నమ్మి మోసపోవద్దు. మీ శ్రేయస్సు కోరే వారిని గుర్తించండి. మీ సొంత ఆలోచనతో ముందుకు సాగండి అన్ని వ్యవహారాలు చక్కబడతాయి.


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121