సుబ్రహ్మణ్యేశ్వర
షష్టి,
మార్దశిర శుద్ధ
షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని
పూజించడం తప్పనిసరి.
నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య
అరాధనమే తరుణోపాయం.
స్కంధ పంచమి,
షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశద్ధలతో ఆరాధిస్తే
సకల
సంపదలు, సుఖవంతమైన
జీవితం చేకూరుతుందని స్మాంద పురాణం చెబుతున్నద
జాతకంలో కుజ
దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత
సుబ్రహ్మణ్యస్వామి
కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.
పెళ్లికాని
వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని
భక్తుల విశ్వాసం
ఆరు ముఖాలు
ఇవే
మొదటిది- మయూర
వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం
రెండోది - పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం
మూడోది-
శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం
నాలుగోది- శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం
ఐదోది - శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం
ఆరోది- లౌకిక సంపదల్ని అందించే ముఖం జాతకంలో
కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి
కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.
పెళ్లికాని
వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం.
వల్లీదేవసేన
సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు
తొలగిపోతాయి
సుబ్రహ్మణ్యస్వామికి
అభిషేకం చేయించినా, అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది
నాగుల చవితి,
నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయలేకపోయినవారు...సుబ్రహ్మణ్య షష్టి రోజు పుట్టలో పాలు
పోసి నువ్వులు
బెల్లంతో చేసిన చిమ్మిలి, బియ్యంపిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్నీ శుభాలే
జరుగుతాయి
మంచి సంతానం
కలగాలన్నా, ఆర్థిక సమస్యలు తీరాలన్నా, కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలన్నా,
విద్యార్థులకు
మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలంటే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనే మంచి పరిష్కారం