మోపిదేవి సుబ్రమణ్య స్వామి మహిమ

మోపిదేవి సుబ్రమణ్య స్వామి మహిమ

నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకొన్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం..!!!


భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు.ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి  క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకొంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలుస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశ వ్యాప్తంగా ఇక్కడమాత్రమే ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపి దేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.


https://bit.ly/3VKZ3Nt

దేవతల వినతి మేరకు వింధ్య పర్వతం గర్వమనచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారత దేశం పర్యటనకు బయలుదేరుతాడు. ఆక్రమంలోనే అగస్త్యమహర్షి క`ష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలీ ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటు పక్కనే దివ్యతేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు.

ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజంచారు. విషయం తెలుసుకొన్న దేవతలందరూఇక్కడకు చేరుకొని స్వామి వారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామి వారి దేవస్థానం లేదా మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది.