ఉత్తరాంధ్రా ప్రజల కొంగు బంగారం

ఉత్తరాంధ్రా ప్రజల కొంగు బంగారం

శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం, విశాఖపట్నం!

ఉత్తరాంధ్రా ప్రజల కొంగు బంగారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మహలక్ష్మి 

దేవాలయాలు చాలా తక్కువ. ఉన్నవాటిలో చెప్పుకోతగిన దేవాలయం మన విశాఖపట్నం లోని "శ్రీ కనక మహలక్ష్మి 

దేవాలయం". ఉత్తరాంధ్ర ప్రజలు విరివిగా సందర్శించే "శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం" విశాఖపట్నంలో జగదాంబజంక్షన్ కు 

అతి చేరువలోగల బురుజుపేట ప్రాంతం లో ఉన్నది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధించే దేవత "శ్రీ 

కనకమహలక్ష్మి" అమ్మవారు.


అప్పటి విశాఖపట్నం రాజావారి ఇలవేల్పు "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు. రాజావారి కోటబురుజు వద్ద అమ్మవారు ప్రతిష్టింప బడ్డారు కాబట్టే ఆ 

ప్రాంతానికి "బురుజుపేట"గా పేరు పెట్టినట్లు తెలుస్తున్నది.


శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి చరిత్ర:

విశేషించి స్థల పురాణం ఏమీ లేకపోయినప్పటికీ స్థానిక కథనం ప్రకారం 1912 లో అప్పటికి బావిలో ఉన్న అమ్మవారిని బయటకు తీసి కోటబురుజు వద్ద 

ప్రతిష్టించారు. అయితే 1917లో రోడ్ల అభివృద్ధి నిమిత్తం అప్పటి స్థానిక మున్సిపల్ అధికారులు ఆటంకముగా ఉన్న అమ్మవారి 

విగ్రహాన్ని తొలగించి ఓ మూల (రోడ్ల విస్తరణకు ఆటంకం లేకుండా) పెట్టటం జరిగింది. ఇలా జరిగిన సంవత్సరంలో విశాఖపట్టణంలో ఎన్నడూ లేని విధంగా ప్లేగు వ్యాధి ప్రబలింది.

ఈ మహమ్మారి ప్లేగు వ్యాధి అప్పట్లో వందల్లో విశాఖవాసుల్ని పొట్టనపెట్టుకుంది. స్థానికులు శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని స్థానభ్రంశం చేసి అపచారం చేయటం వలననే ప్లేగు మహమ్మారి ప్రబలిందని విశ్వసించారు. వెంటనే తొలగించిన "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారి విగ్రహాన్ని యధాస్థానంలో కోటబురుజు వద్ద పునఃప్రతిష్ట కావించారు. పిదప విశాఖపట్నానికి పట్టిన ప్లేగు మహమ్మారి కనుమరుగయ్యింది. అప్పటి నుండి అమ్మవారిని ఉత్తరాంధ్ర ప్రజలు శక్తి కొలది చేసే పూజలు 

అందుకుంటున్నారు "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు.

Shop Now  For SravanMasam Special  :https://shorturl.at/ipxS3

శ్రీ కనమహలక్ష్మి అమ్మవారి వామహస్తాన్ని ఖండించిన పరమ శివుడు?ప్రచారంలో ఉన్న మరొక కధనం ప్రకారం కలియుగ 

ప్రారంభంలో ఓ సద్బ్రాహ్మనుడు మోక్షం కోసం పరమశివునిలో  ఐక్యమొందేందుకు కాశీ ప్రయాణమయ్యాడట. మార్గమధ్యంలో బురుజుపేట చేరుకోవటం పూజదికాదులు చేశుకోవటానికి అచ్చటే ఉన్న నూతిలో స్నానమాచారిస్తుండగా అమ్మవారి వాణి "కలియుగాన భక్తుల కోరిన కోర్కెలు తీర్చుటకు తాను వెలసినందున తనకు ప్రతిష్టాపన చేయమని" సెలివిచ్చినట్లు అందుకు బ్రాహ్మణుడు తాను కాశి పోవుటకు సమయము సరిపోనందున తిరస్కరించినట్లు, "శ్రీ కనక మహహల్క్ష్మి" అమ్మవారు కోపోద్రిక్తురాలై తన వామ హస్తములో గల ఆయుధంతో బ్రాహ్మణుని వధించేందుకు ప్రయత్నించగా, ఆ  బ్రాహ్మణుడు పరమశివుని ప్రార్ధించి శరణు కోరెనట. పరమశివుడు  ఉగ్రరూపురాలైన "శ్రీ కనకమహలక్ష్మి"ని శాంతింప చేసేందుకై అమ్మవారి వామ హస్తాన్ని మోచేతివరకు ఖండించారని కధనం.


శ్రీ కనమహలక్ష్మి ఆలయ విశిష్టత:ఇచ్చటి అమ్మవారి ఆలయానికి ఇతర ఆలయాల వలె గోపురం లేక పోవటం ఒక విశేషం. 

స్థానికులు గోపుర నిర్మాణం చేయ తలచిన ప్రతి సారి ఏదో ఆటంకం  ఏర్పడుతుండటం వలన అమ్మవారికి గోపుర నిర్మాణం ఇష్టం  లేదని నమ్మకం. అలాగే ఇక్కడ భక్తులే స్వయంగా అమ్మవారికి అభిషేకించటం ఆచారం. ఆలయంలో గల బావి (అమ్మవారిని బయటకు తీసిన బావి)చుట్టూ అష్టలక్ష్ముల చిత్రాలు భక్తులను 

విశేషంగా ఆకట్టుకుంటాయి.


మార్గశిర మాసంలో పోటెత్తే భక్తులు :

ముఖ్యముగా ఈ మార్గశిర మాసంలో భక్తులు విరివిగా శ్రీ  కనకమహలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అంతే కాకుండా మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మివారము/గురువారము అమ్మవారిని విశేషమైన  పూజాధికాలు నిర్వహిస్తుంటారు. ఈ (లక్ష్మివారము/గురువారము)  రోజుల్లో భక్తులు వేలాదిగా తరలివచ్చి పూజాధికాలు నిర్వహించి  పరవశిస్తుంటారు. విశేషించి ఈ మాసంలో "శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి" మాలలను కార్తీకశుద్ద ఏకాదశి నుండి పుష్యశుద్ద 

పాడ్యమి మాలలు ధరించి "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు దీక్షలు పూర్తిచేస్తుంటారు. శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి మాలలు ధరించువారు ఆకుపచ్చని వస్త్రాలను ధరించటం పరిపాటి.


శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం 

నిత్య పూజల మరియు సేవల పట్టిక ఉదయం 5గం నుండి 

ఉదయం 6గం వరకు

పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, 

బాలభోగ నివేదన.

ఉదయం 6గం నుండి ఉదయం11గం వరకు

సర్వదర్శనం.

ఉదయం 11గం నుండి 11గం30 ని|| వరకు

ఆలయ పరిశుబ్రత.

ఉదయం 11గం30 ని నుండి 


మధ్యాహ్నం12గం|| వరకు

పంచామృతాభిషేకం, అష్టోత్తర 


సతనామార్చన, 

స్వయం నివేదన.

మధ్యాహ్నం12గం వరకు 


నుండి సాయంకాలం 5గం30 ని|| 

సర్వదర్శనం.

సాయంకాలం 

5గం30 ని నుండి సాయంకాలం 6గం|| వరకు


శ్రావణమాసంలో 


వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. 

సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ  వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున 

ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. 

పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ 

విశేషపూజ ఉంది.


పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో 

 తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. 


వెలుగుతున్న ఆ జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, ఆ జ్యోతి  స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం 

సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేద్యం 


పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం 

కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేద్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన.!