ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ

ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ

పద్మనాభ మాసము(ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ )

బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదము

ఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో ! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను.

 

శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను . ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ'ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను


ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల తీర్థములలో స్నాన ఫలమును ఒసంగును. సంసారమున యున్న మానవులు ఏ కారణము వలననైనను మోహవశులై ఎట్టి దుష్కర్మములు చేసివారైనను నరకయాతన అనుభవించుచున్ననూ

ఈ వ్రతాచరణవలన ఆ కష్టముల నుండి విముక్తి పొందుదురు. ఎవరు భగవంతునినిందించుచు భగవద్భక్తులను అవమానించుదురో వారికి తప్పక నరకము ప్రాప్తించును. అట్టివారు ఎన్ని వ్రతములు ఆచరించినను సత్ఫలితమును పొందజాలరు. మనుష్యజన్మమును పొంది ఈ ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని పాటించని వారు ఎందులకూ పనికిరానివారై జీవితము వ్యర్ధమగును. అట్టి వారు యజ్ఞయాగములు చేసినను నిష్ఫలమేయగును. కనుక ఈఏకాదశిని మించిన వ్రతము లేదని శాస్త్రములు మఱల మఱల ఘోషించుచున్నవి.



ఈ తిథియందు ఉపవాసముండి, కృష్ణసేవ, కృష్ణనామము చేయుట, కృష్ణకథాశ్రవణము చేయుట అత్యావశ్యకములు. రాత్రియందు జాగరణ చేయవలెను. ఈ వ్రతమును ఆచరించిన వారి వంశములలో మూలమున పితృ మాతృ పదితరములవారు ఉద్ధరింపబడుదురు. - బాలకులు,యువకులు,వృద్ధులు ఎవ్వరైనను యీ వ్రతమును పాటించవచ్చు. దురాచార సంపన్నులైన మానవులు యీ ఏకాదశీ ఉపవాసము చేసి ఊర్ధ్వలోకములు పొందుటకు అవకాశము గలదు.


తిల- సువర్ణ - భూ- జల - ఛత్ర(గొడుగు) మఱియు పాదుకలు దానము చేసినచో వారికి యమలోక నరకబాధలు కలగవు. సత్యర్మములు చేయనివాని జీవితం నిష్ఫలము. అంతేకాక ఓ ధర్మరాజా ! ఈ వ్రతమాచరించిన వారు దీర్ఘాయుస్సు కలిగి యుండి ధనధాన్యములతో సుఖముగా నుందురు. మఱియు సర్వదోషముల నుండి విముక్తి పొంది భగవద్ ల్లోకమునకు వెళ్లుదురు.



జై శ్రీమన్నారాయణ


Products related to this article

Karthika Masam Special Laksha Deepam

Karthika Masam Special Laksha Deepam

Karthika Masam Special Laksha Deepam Product Description:1 Cotton Laksha Deepam which is dipped in Ghee.1 Turmeric powder pack.1 Kumkuma Powder Pack.1 Camphor pack.     1..

$8.00