What should we do on Ratha Saptami?

What should we do on Ratha Saptami?

తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి  సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము 

కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి  తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, 


తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి  యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు 


మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు.అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య 

నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం 

వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినాక్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు 


సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ 

దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు. ఆ స్వామి కృత్తికా 

నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి 

పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే 

సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, 

చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి 

రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.

రథ సప్తమి సందర్భంగా పూజ 


విధానం

సూర్యనారాయణ స్వామి షోడశోపచార 

https://youtu.be/axU5nCsO3EI

పూజా విధానం

ప్రత్యక్ష దైవమైన , శుభకరుడైన 

సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్యజయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమినాడు జరుపుకుంటారు. ఈ సూర్యజయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేసం 

రథం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది. *జిల్లేడు స్నానం ఏవిధంగా చేయాలి:*

ఈ విశేషమైన పుణ్యదనమున అర్కః అను నామము కలిగిన సూర్యనారాయణునికి  ప్రీతికరమైన శ్వేత అర్కపత్రముల(తెల్ల జిల్లేడు  ఆకుల) కు రంధ్రం చేసి , ఆ రంధ్రంలో రేగిపండు  ఉంచి శిరస్సుపై , భుజములపై , హృదయంపై 

ఉంచి శిరస్నానం చేయవలెను. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్యనుంచి సూర్యుని దర్శనం  చేసుకొని నమస్కరించవలెను.

*పొంగలి చేయు విధానం:*స్త్రీలు ఈ రోజు చిక్కుడు ఆకులు , చిక్కుడు పువ్వులు , చిక్కుడు కాయలతో వివిధ ఫల , పుష్పాలను సేకరించి , సంక్రాంతి గొబ్బెమ్మలు  పిడకలుగా అయినవి తెచ్చి పాలదాలిగా తులసికోట 

వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవుపాలను పొంగించి, పొంగలి చేయవలెను. తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ పూర్తి చేసి , పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా  నివేదించాలి.

ఈ విధంగా సూర్య ఆరాధన చేయుట చేత 

ఆయురాగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశ వృద్ధి 

చేకూరుతుంది అని ప్రఘాఢ విశ్వాసం.

*శ్రీ పసుపు గణపతి పూజ:*

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ 


కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము , 


కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు 


రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

*ఆచమనం*

ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా 


, ఓం మాధవాయ స్వాహా ,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, 

విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, 

త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, 

శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, 

పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, 

సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, 

ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, 

పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, 

నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, 

జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, 

హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో 


జయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో 


నమామ్యహమ్ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః 


ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం 


నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః 

శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః

అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు 


వేసుకొనవలెను.)

*ప్రాణాయామము*

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును 


ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః 


ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో 


దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ 


భూర్బువస్సువరోమ్

*సంకల్పం:*

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర 


ప్రీత్యర్ధం శుభే , శోభ్నే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో 


రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ 


పరార్ధే , శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే 


కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, 


భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య 


(మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ / 


గంగా / గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి 


ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) 


అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత 


సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే 


(ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) 


మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ 


(ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) 


శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే , 


శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం , 


శుభతిథౌ , శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ 


పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య 


అస్మాకం సహకుటుంబానాం క్షేమ , స్థైర్య , ధైర్య , 


విజయ, అభయ , ఆయురారోగ్య 


ఐశ్వర్యాభివృద్యర్థం , ధర్మార్ద , కామమోక్ష 


చతుర్విధ ఫల , పురుషార్ధ సిద్ద్యర్థం , ధన , కనక , 


వస్తు వాహనాది సమృద్ద్యర్థం , పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం 


, సర్వాపదా నివారణార్ధం , సకల 


కార్యవిఘ్ననివారణార్ధం , సత్సంతాన సిధ్యర్ధం , 


పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం , 


ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం , శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా 


ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం 


యావద్బక్తి ధ్యాన , వాహనాది షోడశోపచార 


పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

*కలశారాధనం:*

శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి 


పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై 


కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము 


చదువవలెను.)

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ 


దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ 


సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో 


దేవునిపైనా పూజాద్రవ్యములపైన , తమపైన 


జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై 


జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము 


చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే 


కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత 


అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి , 


ఆవాహయామి , నవరత్న ఖచిత సింహాసనం 


సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం 


సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం 


సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి 


శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం 


సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం 


సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ 


సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,

ఏకదంతాయ నమః,

కపిలాయ నమః,

గజకర్ణికాయ నమః,

లంబోదరాయ నమః,

వికటాయ నమః,

విఘ్నరాజాయ నమః,

గణాధిపాయ నమః,

ధూమకేతవే నమః,

గణాధ్యక్షాయ నమః, 

ఫాలచంద్రాయ నమః, 

గజాననాయ నమః, 

వక్రతుండాయ నమః,

శూర్పకర్ణాయ నమః, 

హేరంబాయ నమః, 

స్కందపూర్వజాయ నమః, 

ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,

మహాగణాదిపతియే నమః 

నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం 


సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం 


భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు 


అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః 


గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా , 

ఓం అపానాయస్వాహా , 

ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా , 

ఓం సమానాయ స్వాహా , మధ్యే మధ్యే పానీయం 


సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి , నీరాజనం 


దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి 


చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే 


కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత 


అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం 


సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ 


మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల 


అక్షతలు ,పుష్పములు శిరస్సున 


ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం 


ముద్వాసయామి.

*(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)*

*ప్రాణప్రతిష్ఠపన*

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో 


దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత 


మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః 


అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే 


ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, 


అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ 


యత్కించిత్ నివేదితం మయా|| తదంగ 


ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ 


ధ్యానం.

*రథసప్తమి – సూర్య నారాయణ స్వామి 


షోడశోపచార పూజ:*

*ధ్యానం:*

ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! 


గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! 


భూతేశా ! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! 


అంచిత్యా విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! 


ఆదిమధ్యాస్త భాస్కరా ! ఓ జగత్ప్రతే ! భక్తి 


లేకున్నను, క్రియాశూన్యమయినను, నేను చేసిన 


అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము.

(పుష్పము చేతపట్టుకొని)

*ఆవాహనం:*

ఓం ఆదిత్యాయ నమః ఆవాహయామి /

*ఆసనం:*

ఓం ఆదిత్యాయ నమః పుష్పం సమర్పయామి

(అక్షతలు వేయవలెను.)

*పాద్యం:*

ఓం ఆదిత్యాయ నమః పాద్యం సమర్పయామి.

(ఉదకమును విడవవలెను.)

*అర్ఘ్యం:*

ఓం ఆదిత్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

*ఆచమనం:*

ఓం ఆదిత్యాయ నమః ఆచమనీయం 


సమర్పయామి.

(ఉదకమును విడువవలెను.)

*స్నానం 

ఓం ఆదిత్యాయ నమః శుద్ధోదకస్నానం 


సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

*పంచామృతస్నానం*

ఓం ఆదిత్యాయ నమః క్షీరేణ స్నాపయామి .

(స్వామికి పాలతో స్నానము చేయవలెను)

ఓం ఆదిత్యాయ నమః దధ్యా స్నాపయామి .

(స్వామికి పెరుగుతో స్నానము చేయవలెను)

ఓం ఆదిత్యాయ నమః అజ్యేన్న స్నాపయామి.

(స్వామికి నెయ్యితో స్నానము చేయవలెను)

ఓం ఆదిత్యాయ నమః / మధునా స్నాపయామి

(స్వామికి తేనెతో స్నానము చేయవలెను)

ఓం ఆదిత్యాయ నమః ! శర్కరాన్ స్నపయామి.

(స్వామికి పంచదారతో స్నానము చేయవలెను)

ఓం ఆదిత్యాయ నమః – ఫలోదకేన స్నాపయామి

(స్వామికి కొబ్బరినీళ్ళుతో స్నానము చేయవలెను)

ఓం ఆదిత్యాయ నమః – శుద్ధోదకస్నానం 


సమర్పయామి.

(స్వామికి నీళ్ళుతో స్నానము చేయవలెను)

*వస్త్రం:*

ఓం ఆదిత్యాయ నమః – వస్త్రయుగ్మం 


సమర్పయామి.

*యజ్ఞోపవీతం:*

ఓం ఆదిత్యాయ నమః యజ్ఞోపవీతం 


సమర్పయామి.

*గంధం:*

ఓం ఆదిత్యాయ నమః గంధం విలేపయామి.

(గంధం చల్లవలెను.)

*అక్షతలు*

ఓం ఆదిత్యాయ నమః అక్షతాన్ సమర్పయామి.

(అక్షతలు సమర్పించవలెను)

*అథాంగపూజ:*

ఓం ఆదిత్యాయ నమః – పాదౌ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – జంఘే పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – జానునీ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – ఊరుం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – గుహ్యం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – కటిం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – నాభిం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – ఉదరం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – హృదయం 


పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – హస్తౌ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – భుజౌ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – కంఠం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – ముఖం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – నేత్రాణి పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – లలాటం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – శిరః పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – మౌళీం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – సర్వాణ్యంగాని 


పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – అథాంగ పూజయామి.

*ధూపం:*

ఓం ఆదిత్యాయ నమః – ధూపమాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

*దీపం:*

ఓం ఆదిత్యాయ నమః దీపం దర్శయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

*నైవేద్యం:*

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ 


నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః , ఓం త తసవితు ర్వరేణ్యం 


భర్గో దేవస్య ధీమహి , ధియో యోనః ప్రచోదయాత్ , 


సత్యం త్వర్తేన పరిషించామి , అమృతమస్తు , 


అమృతోపస్తరణ మసి

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు 


చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా ,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 


తన్నో రుద్రఃప్రచోదయాత్

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం 


సమర్పయామి

హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – 


శుద్దాచమనీయం సమర్పయామి.

*తాంబూలం:*

తాంబూలం చర్వణానంతరం శుద్ధాచమనీయం 


సమర్పయామి.

ఓం ఆదిత్యాయ నమః తాంబూలం సమర్పయామి.

*నీరాజనం:*

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో 


హారతి నీయవలెను)

ఓం ఆదిత్యాయ నమః నీరాజనం సమర్పయామి.

అనంతరం ఆచమనీయం సమర్పయామి.

*ఆత్మప్రదక్షిణ*

(కుడివైపుగా 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవలెను)

యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ,

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః ,

త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల.

శ్రీ ఆదిత్యాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ 


సమర్పయామి.

*అర్పణం::*

శ్లో // యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా 


క్రియాదిషు

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమీశ్వరం 


//

మంత్రహీనం క్రియాహీనమ్ భక్తహీనం మహేశ్వర

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే //

సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు

శ్రీ ఆదిత్యాయ ప్రసాదం శిరసా గృహ్ణామి //

(పుష్పాదులు శిరస్సున ధరించవలెను.)

*తీర్థస్వీకరణం:*

శ్లో // అకాలమృత్యుహరణం – సర్వవ్యాధి 


నివారణం

సమస్త పాపక్షయకరం – ఆదిత్యాయ పాదోదకం 


పావనం శుభం //

(అనుచు స్వామి పాద తీర్థమును 


పుచ్చుకొనవలెను.)

*శుభం భూయాత్ ..