'మాతృకర్మ' అని ఎందుకు అనరు?

'మాతృకర్మ' అని ఎందుకు అనరు?

 'పితృకర్మ' 'పితృపక్షం' 'పితృదేవతలు'..... ఇలా అన్నీ తండ్రి పరంగానే చెప్తారు. మరి-మరణించిన తల్లి గురించి కర్మచేసేటప్పుడు 'మాతృకర్మ' అని ఎందుకు అనరు? ఇక్కడ కూడా పురుషాధిక్యమా? 'మాతృదేవతలు' హిందువుల్లో లేరా? 


Book NOW :

Mahalayam Paksham Special Pitru Karmalu In Kasi From (30th Sep to 14th Oct 2023)

https://shorturl.at/ahjsZ


జ :సంస్కృతంలో 'పితృ' శబ్దం తల్లిదండ్రులిద్దరికీ వాడబడుతుంది. 'మాతా చ పితాచ పితరౌ' - తల్లిదండ్రులిద్దరినీ కలిపి చెప్పేటప్పుడు (మాతాపితలు) “పితరౌ” అనాలి. అదే తెలుగులో అనేటప్పుడు 'పితరులు' అంటారు. అందువల్ల-‘'పితృ" శబ్దం ఉభయులనూ తెలియజేస్తుంది. 'పితృదేవతలు' వేరు, మరణించిన పూర్వీకులు వేరు. వీరు ఒక విధమైన దేవతాగణం. వారిని ఆరాధించి, వారికృప వలన తమ తల్లి దండ్రులు ఎక్కడున్నా సద్గతి పొందాలని ఆశించేదే 'పితృకర్మ'.

'మాతృగణాలు' అని దేవతల్లో మరో ప్రత్యేకగణం ఉన్నారు. వారు జీవుల కర్మఫలాల బట్టి వివిధానుభవాలను ఇస్తారు. ఇదికాక 'అష్టమాతృకలు' వంటివి ఉన్నాయి.

అసలు హిందువుల్లోనే దేవతలను మాతృరూపంలో, మాతను దేవతగా పూజించడం నేటికీ ఉంటుంది. దుర్గలక్ష్మి, సరస్వతి, పార్వతి వంటి నామాలతో జగన్మాతను ఆరాధించే దేశం మనది.