On the occasion of Subrahmanyaswamy's Adhikritika

On the occasion of Subrahmanyaswamy's Adhikritika

కావడి ఉత్సవం విశిష్టత

ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి అఢికృతిక సందర్భంగా


కుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్‌ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా కూడా మారతాడు. అయితే ఇడుంబన్‌లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు. ‘నాయనా , నేను కైలాసం నుంచి శివగిరి , శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా’ అని ఆజ్ఞాపిస్తాడు. ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు ఇడుంబన్‌. 

       Shop Now For Sravana Masam Special https://rb.gy/8i7ad

ఆ రాక్షసుడి అసురత్వాన్ని సుబ్రహ్మణ్యుడే పోగొడతాడని శివుడు అందుకు అడ్డు చెప్పడు. అలా కొండల్ని మోసుకుని కొంతదూరం వెళ్లిన ఇడుంబన్‌ పళని ప్రాంతంలో వాటిని కింద పెట్టి సేదతీరతాడు. కాసేపటికి లేచి కావడి ఎత్తుకుంటే ఒకవైపు బరువుగా , ఇంకోవైపు తేలిగ్గా ఉండటం గమనిస్తాడు. కావడిని దించి చూస్తే బరువున్న కొండపైన సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పకపకా నవ్వుతూ కనిపిస్తాడు. ఆ చర్యకి కోపమొచ్చిన ఇడుంబన్‌ స్వామిని వధించాలని కొండపైకి వెళతాడు. ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు అతడిని సంహరిస్తాడు. విషయం తెలిసిన అగస్త్యముని ఇడుంబన్‌ను బతికించమని వేడుకుంటాడు. శిష్యుడి కోరికను మన్నించిన స్కందుడు ఇడుంబన్‌ను బతికించి... తన కొండ కిందకొలువై ఉండమనీ , భక్తులు ముందుగా అతడిని దర్శించుకున్నాకనే తన సన్నిధికి రావాలనీ వరమిస్తాడు.


అలానే షష్ఠినాడు పాలు , విభూతి , పూలు , తేనె , నెయ్యి... వీటిలో ఏదో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకొస్తే తనని ఆరాధించిన  ఫలితం దక్కుతుందని చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమవుతాడు. అప్పట్నుంచీ పళని కొండకి ఇడుంబన్‌ అనే పేరు వచ్చింది. స్వామి వారి మెట్ల మార్గం దగ్గర ‘ఇడుంబన్‌’ గుడి ఉంటుంది. భక్తులు ఆ మూర్తిని దర్శించుకున్నాకే వల్లీదేవసేన సమేతుడైన కుమారస్వామి సన్నిధికి వెళతారు.  ఈక్షేత్రం మదురైకి 120 కి.మీ దూరంలో ఉంది. 


హైదరాబాద్‌ నుంచి మదురైకి విమానంలో వెళ్లి అక్కణ్నుంచీ రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లొచ్చును. రైల్లో అయితే హైదరాబాద్‌ నుంచి మదురైగానీ , చెన్నై సెంట్రల్‌ వరకూగానీ వెళ్లి అక్కణ్నుంచీ చెన్నై సెంట్రల్‌ - పళని ఎక్స్‌ప్రెస్‌లో పళని చేరుకోవచ్చును. రైల్వే స్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో , బస్సుల సౌకర్యం కూడా ఉంటుంది.