నవకైలాస క్షేత్రాలు చూశారా?

నవకైలాస క్షేత్రాలు చూశారా?

నవకైలాస క్షేత్రాలు చూశారా? 

హిందూ ధర్మంలో తొమ్మిదికి విశిష్ట స్థానం ఉంది. నవగ్రహాలు, నవ నందులు, నవ తిరుపతులు, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు తొమ్మిది అంకెతో ముడిపడి ఉన్నాయి. అదే విధంగా నవ కైలాస క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నవ కైలాస క్షేత్రాల్లో ప్రధాన దైవం ఆ పరమశివుడే. జీవితంలో ఒక్కసారైనా ఈ నవ క్షేత్రాలను సందర్శిస్తే, మోక్షం ఖచ్చితమని శైవధర్మాన్ని అనుసరించే వారి నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ నవ కైలాస దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి. వాటి విశిష్టతలు ఏమి, తదితర వివరాలన్నీ మీ కోసం..

ఈ నవ శైవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షమే.

ఈ నవ కైలాస క్షేత్రాలకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దీని ప్రకారం పూర్వం అగస్త్య మహాముని వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి మోక్షం పొందాలన్న ఆశ ఉండేది.

అదే విధంగా అగస్త్య మహాముని కూడా శిష్యుడి నడవడిక చూసి, అతనికి మోక్షం ప్రసాదించాలని భావిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో, ఒకరోజు ధాన్యంలో గూర్చొన్న అగస్త్యమహాముని అకస్మాత్తుగా కళ్లుతెరిచాడు.

అంతేకాకుండా తన ఎదురుగా ఉన్న పువుల్లో తొమ్మిదింటిని తీసుకొని శిష్యుడికి ఇచ్చాడు. ఆ పుష్పాలను నీటిలో వదిలి వాటిని వెంబడిస్తూ వెళ్లాలని చెప్పాడు. అంతేకాకుండా ఒక్కొక్క పుష్పం ఎక్కడైతే భూమిని తాకుతుందో, అక్కడ శివలింగాన్ని ప్రతిష్టింపజేయాలని శిష్యుడికి చెప్పాడు.

చివరికి ఆ నది సముద్రంలో కలిసే చోట, పవిత్ర స్నానాన్ని చేయాల్సిందిగా శిష్యుడికి సూచించారు. గురువు చెప్పినట్లే చేసి ఆ శిష్యుడు మోక్షం పొందాడు. ఇక ఆ శిష్యుడు ప్రతిష్టించిన తొమ్మిది శివలింగాలను కలిపి, నవ కైలాస క్షేత్రాలని అంటారు.

ఈ నవ కైలాస క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. అంతేకాకుండా పాపనాశనం అని పిలుస్తారు. ఈ పాపనాశనం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబసముద్రంలో ఉంది. తామిరభరణి నది ఒడ్డున ఈ పాపనాశనం ఉంది.

ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడిని పాపనాశనాథార్ అని పిలుస్తారు. అంటే పాపాలను నాశనం చేసేవాడు. ఇక్కడ ఉన్న అమ్మవారిని లోకనాయకి అని పిలుస్తారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు నంది వాహనా సమేతులై, అగస్త్యమహామునికి దర్శనమిచ్చినట్లు చెబుతారు.

కాగా ఇక్కడ ఉన్న నీటిలో తామ్రం అంటే రాగి లోహం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ నీటిలో స్నానం చేస్తే చర్మరోగాలు సమిసిపోతాయని భక్తుల నమ్మకం. ఈ పాపనాశం చుట్టు పక్కల చూడటానికి అనేక జలపాతాలు ఉన్నాయి. అందులో అగస్తియార్ జలపాతం అత్యంత అందంగా కనిపిస్తుంది.

శివరాత్రి పర్వదినాన ఈ నవకైలాస క్షేత్రాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారిని సందర్శించుకొంటారు. ముఖ్యంగా పాపనాశం వద్ద భక్తుల రద్ది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఒక్కొక్క శివుడి దేవాలయం ఒక్కొక్క గ్రహానికి ప్రతీకగా చెబుతారు.

అందువల్లే నవకైలాస యాత్ర, నవగ్రహ యాత్ర దర్శన ఫలం అందిస్తుందని స్థానిక భక్తుల నమ్మకం. ముఖ్యంగా శని, కాలసర్ప దోషాలతో బాధపడేవారికి, ఈ నవ కైలాసయాత్ర వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

ఇక ఈ దేవాలయాలు తమిరభరణి నదీతీరంలో పాపనాశం నుంచి ప్రతి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ప్రతి దేవాలయాన్ని, అరల్ముగు కైలాసనాథార్ దేవాలయం అనే పిలుస్తారు. వీటిని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని బలంగా నమ్ముతారు.

ఈ నవ శైవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షమే.

ఆ తొమ్మది క్షేత్రాల వివరాలతోపాటు ఏ ఏ ప్రదేశంలోని దేవాలయంలోని మూలవిరాట్టు ఏ ఏ గ్రహాలను ప్రతిబింబిస్తుందన్న విషయం మీ కోసం...

పాపనాశనం .........సూర్యుడు, చరణ్ మహాదేవి ........... చంద్రుడు, కొడగన్నలూర్...........అంగారకుడు, కున్నత్తుర్............రాహువు, మరపన్నాడు...............గురుడు, తిరువైకుండమ్........శని, తెంతిరుప్పేరయ్...............బుధుడు, రాజపతి........కేతువు, సయిద పొమంగళం...............శుక్రుడు

Nava Kailasam Temples

Pavanasar Temple (Suriyan Temple): Located in Papanasam, Tirunelveli, associated with Suryan (Sun)

.  పాపనాశం కైలాసనాథర్ ఆలయం

స్థానం : పాపనాశం తిరునెల్వేలి నుండి 45 కి.మీ.

ఆలయ సమయాలు : ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4:30 నుండి 8 వరకు.  

సూచనలు : మధ్యాహ్నానికి ముందు పాపనాశం చేరుకోవడానికి ప్రయత్నించండి, కాబట్టి మీరు ఆలయాన్ని సందర్శించి ఆపై అగస్తియర్ జలపాతానికి వెళ్లవచ్చు. అక్కడ ఉండగా, అగస్త్యుడు మరియు లోపాముద్ర కైలాస్లో జరిగే దివ్య కళ్యాణాన్ని కళ్యాణ తీర్థం పైకి ఎక్కండి. మీకు సమయం ఉంటే, ఆనకట్టను కూడా సందర్శించండి.

Sri Ammainathar Temple (Chandran Temple) Navakailayam 2: Found in Melkallur, Cheranmahadevi, Tirunelveli, associated with Chandra (Moon).  చేరన్మహాదేవి కైలాసనాథర్ ఆలయం

స్థానం : చేరన్మహాదేవి తిరునెల్వేలి నుండి 20 కి.మీ.

ఆలయ సమయాలు : ఉదయం 7 నుండి 10 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు

సూచనలు : చేరన్మహాదేవి వద్ద ఉన్నప్పుడు, భక్తవత్సల పెరుమాళ్ ఆలయాన్ని మిస్ అవ్వకండి, ఇది ఇక్కడ అత్యంత అందమైన ఆలయాలలో ఒకటి మరియు ASI చే నిర్వహించబడుతుంది.

Sri Kailasanathar Temple - Kodaganallur (Chevvai Temple) - Nava Kailayam 3: Located in Kodaganallur, associated with Mangal (Mars)

.  కొడగనల్లూరు

స్థానం : కొడగనల్లూరు తిరునెల్వేలి నుండి చేరన్మహాదేవికి వెళ్ళే మార్గంలో సుమారు 15 కి.మీ.

ఆలయ సమయాలు : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5 నుండి 7 వరకు.

Arulmigu Gothaparameshwarar Temple Kunnathur (Raaghu): Associated with Rahu, situated in Kunnathur.  కున్నత్తూరు

స్థానం : కున్నతుర్ తిరునెల్వేలి రైల్వే స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో ఉంది.

ఆలయ సమయాలు : ఆలయం సాధారణ రోజుల్లో ఉదయం 7:30 నుండి 10:30 వరకు మరియు సాయంత్రం 5 నుండి 6:30 వరకు తెరిచి ఉంటుంది. శని, శుక్రవారాలు మరియు ప్రత్యేక పూజా రోజుల వంటి ప్రత్యేక రోజులలో, ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది.

Sri Kailasanathar Temple, Murappanadu.  మురప్పనాడు

స్థానం : మురప్పనాడు తిరునెల్వేలి నుండి 17 కి.మీ మరియు టుటికోరిన్ నుండి 40 కి.మీ దూరంలో ఉంది (Guru) Nava Kailayam 5: Found in Murappanadu, Vadavallanadu, associated with Brihaspati (Jupiter).

Srivaikundam Kailasanathar Temple – The Sixth Kailasam (Sani): Associated with Shani (Saturn)

 and located in Srivaikundam.  శ్రీ వైకుంటం కైలాసనాథర్ ఆలయం

స్థానం : శ్రీవైకుంటం తిరునెల్వేలి నుండి 30 కి.మీ, మరియు తిరుచెందూర్ నుండి 30 కి.మీ.

ఆలయ సమయాలు : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి 8:30 వరకు.

Thenthiruperai Alagiya Ponnammaa Sametha Kailasanathar Temple (Budhan): Associated with Budha (Mercury) and situated in Thenthiruperai.  తేన్తిరుప్పేరై

స్థానం : తేన్తిరుప్పేరై తిరునెల్వేలి నుండి తిరుచెందూర్ వైపు 38 కి.మీ.ల దూరంలో ఉంది.

ఆలయ సమయాలు : ఉదయం 8 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 నుండి 7 వరకు.

Raajapathy (Kethu): Temple associated with Kethu.  రాజపతి

స్థానం : రాజపతి తిరునెల్వేలి నుండి తిరుచెందూర్ వైపు 40 కి.మీ దూరంలో ఉంది.

ఆలయ సమయాలు : ఉదయం 6 నుండి 11 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు

Serndhapoomangalam Nava Kailasam (Sukran): Associated with Shukra (Venus)

. సేర్ందపూమంగళం

స్థానం : సెర్ందపూమంగళం టుటికోరిన్ నుండి 20 కి.మీ మరియు తిరునెల్వేలి నుండి 45 కి.మీ దూరంలో కీజాతుర్ సమీపంలో ఉంది.

ఆలయ సమయాలు : 7 నుండి 9:30AM, 5:30 నుండి 7:30 PM.

Nava Kailasam Temples play a significant role in Hindu astrology and are visited by devotees seeking blessings and relief from astrological influences associated with different planets.








Products related to this article

Karthika Masam Special Laksha Deepam

Karthika Masam Special Laksha Deepam

Karthika Masam Special Laksha Deepam Product Description:1 Cotton Laksha Deepam which is dipped in Ghee.1 Turmeric powder pack.1 Kumkuma Powder Pack.1 Camphor pack.     1..

$7.00 $8.00

Karthika Masam Special 365 Wicks

Karthika Masam Special 365 Wicks

Karthika Masam Special 365 Wicks  Product Descoription:1). One 365 cotton wicks which is dipped in gingerly Oil.2). One Mud Diya 3). One tissue Paper...

$1.00 $1.50