ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి

ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి

ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి

ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు.

ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు 

మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు

 కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు, దేవయానం, పితృయానం అంటారు. 

ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని ,  భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. 

దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు 

ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశాడు. దేవతలకు ఆరునెలలు పగలు, 

ఆరునెలలు రాత్రి,  దక్షిణాయానం రాత్రికాలం. 

ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు, అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. 

ఉపవాసం :

అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. దశమి రాత్రి కూడా భుజించకూడదు. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు

 స్వరుపమైనది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి.

ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి.

కృత్యోత్సవం తథా భూతం ఏకాదశ్యాం విశేషతః విశంతి మోక్షం తస్మాత్ స మోక్షత్సవ ఇతీర్యతే ॥

ముక్కోటి ఏకాదశి వేకువజామున ఉత్తరద్వారం నుండి శ్రీమహావిష్ణుదర్శనం చేసుకొన్నవారికి మోక్షం తప్పక లభిస్తుంది. 

కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు, ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం

 ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది. 

ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని కూడ అంటారు.

శ్రీ మహావిష్ణువుతో పాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. 

ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి.  

కధనం :

బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో

 నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు.

వైఖానసుడు అనే రాజు రాజకార్య నిమగ్నుడై దేవతలను, పితృదేవతలను పూజించటం మానేశాడు.

 దాంతో పితృదేవతలు దుఃఖంతో కలలో కనబడ్డారు, 'నాయనా! నీవు దేవతార్చన, పితృదేవతార్చన 

చేయకపోవడం వలన మాకు ఉత్తమలోకాలు లభించటం లేదు. వైకుంఠ ఏకాదశినాడు స్వామిని ఉత్తరద్వార

 దర్శనం చేసుకొని 'ఏకాదశీవ్రతం' ఆచరించి, ఆ ఫలాన్ని ధారపోస్తే మాకు పుణ్యలోకాలు, నీకు ముక్తి లభిస్తాయి' 

అన్నారు. వైఖానసుడు వారు చెప్పినట్లు చేశాడు. 

ఐహిక బాధ్యతలతో మునిగి దేవపితృకార్యాలను మరచిపోయే వారికి ముక్కోటి ఏకాదశి కర్తవ్యాన్ని గుర్తు

 చేస్తుంది.ఏకాదశీవ్రతం ఆచరించి పితృదేవతలకు ఆ పుణ్యాని ధారపోయడం ద్వార వారికి పుణ్యలోక

 ప్రాప్తి లబిస్తుంది , దారపోసినవారికీ 33 సూర్యమండల ఏకాదశి చేసిన ఫలితం వస్తుంది . 

ప్రాచుర్యంలో ఉన్న ఇంకో కధనం మురాసురుడి కథ కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, 

సత్పురుషులను బాధించేవాడు. 

దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, 

మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానిమురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో 

దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.

విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. 

అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. 

విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ

 వ్రతం ప్రాచుర్యం పొందింది.

తాత్త్విక సందేశం

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం.కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, 

ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో 

ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా

 ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. 

పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు(కాళ్లు, చేతులు మొదలైనవి), 

మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం.ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. 

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన 

ఏకాదశి మాత్రమే సంహరించగలదు. 

అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

ముక్కోటి ఏకాదశి వ్రతమాచరిస్తే మరు జన్మంటూ ఉండదట!!

అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని

 దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి 

నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను

 గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే 

హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు!!. ధనుర్మాసంలో వచ్చే

 ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. 

ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. 

పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న

 పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. 

ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు 

మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని

 బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి 

దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న

 బిరుదు ప్రసాదించాడు.నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు

అంటున్నారు.వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు

 అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. 

ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ

 ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి, సూర్యుడు ఉత్తరాయణ 

పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ

 వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.అందుకే

 ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి.

 నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. 

ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో

 సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును..ముక్కోటి ఏకాదశి నడు 

చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. 

ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

Products related to this article

Narmada Bana Lingam

Narmada Bana Lingam

Narmada Bana Lingam ..

$5.50

Spatika Bana Lingam (21 to 25 Grams)

Spatika Bana Lingam (21 to 25 Grams)

Discover the divine significance and spiritual benefits of Spatika Bana Lingam. Made from pure quartz crystal (Spatika), the Bana Lingam is a sacred symbol of Lord Shiva's divine energy and presence. ..

$15.00