Mistakes to Avoid While Worshiping Lord Shiva

Mistakes to Avoid While Worshiping Lord Shiva

 శివుడిని పూజించేటప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పొరపొట్లు..!!

హిందూ పురాణాల ప్రకారం, సోమవారం శివుడికి ప్రత్యేకం. మీకు తెలుసా ? శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం

 దాగుంది. శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో 

పూజించడం వల్ల, ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరిస్తాయి.

శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి.

అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. 

శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..

బిల్వ పత్రం

శివుడికి బిల్వ పత్రం సమర్పించడం, చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం, శివుడి 

మూడు కనులకు చిహ్నం.అలాగే త్రిశూలానికి సంకేతం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి. 

అయితే ఈ ఆకులను చెట్టు నుంచి త్రుంచేటప్పుడు, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

బిల్వపత్రం కోయకూడని రోజులు:

బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు 

నుంచి తీయకూడదు.

ముక్క పోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాత, శివుడికి సమర్పించాలి.

Shop Now Sankranthi Special :https://www.epoojastore.com/idols/brass-idols

కుంకుమ వద్దు

శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధంను, మాత్రమే ఉపయోగించాలి.

శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల..

ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ, శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు, వేడిమి పుట్టిస్తుంది. 

అందుకే కుంకుమకు బదులు, చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి.

కొబ్బరినీళ్లు వద్దు

కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై వేయకూడదు.

ఏ పండ్లు సమర్పించాలి

శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు.

అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్షాయుష్షుని సూచిస్తుంది.

ఇలాంటి పూలు వద్దు

సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించరాదు. శివుడు వాటికి శాపం విధించినట్లు చెబుతారు. 

ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని, బ్రహ్మ సంపంగి పూవులను అడుగుతాడు. దీంతో.

 బ్రహ్మ, సంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు.

స్టీల్ స్టాండ్

శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించరాదు. ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే.. 

జలధార కంపల్సరీ ఉండాలి.అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. 

జలధార లేకుండా.. శివలింగం పెట్టుకుంటే.. నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది.

పూజించే విధానం

శివుడిని పూజించే ముందు, వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి 

విగ్రహానికి సమర్పించిన తర్వాత, మరో దేవుళ్లకు ఉపయోగించాలి.

ఎలాంటి పూజ చేసినా.. ముందుగా వినాయకుడిని పూజించాలని, స్వయంగా శివుడే వివరించాడు.

తులసి

శివపురాణం ప్రకారం, శివుడు తులసి భర్తను చంపేశాడు. కాబట్టి తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ, 

శివుడికి సమర్పించరాదు.

శుభ్రంగా

ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత, పూజ మొదలుపెట్టాలి. 

సూర్యోదయం సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.

మంత్రం

పూజలు చేసే సమయంలో, "ఓం నమః శివాయ" మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ ఐదు అక్షరాల మంత్రం 

చాలా శక్తివంతమైనది.

ఇలా పూజ చేసి, శివుని అనుగ్రహం పొందoడి..

Products related to this article

Snacks Making Lady

Snacks Making Lady

Experience the traditional artistry with Snacks Making Lady Kondapalli Toys - handmade toys depicting women engaged in the traditional activity of making snacks. Explore the intricate craftsmanship an..

$15.00

Mother and Child Etikoppaku Toys

Mother and Child Etikoppaku Toys

Mother and Child Etikoppaku Toys ..

$14.00