మాస శివరాత్రి అంటే ఏమిటి?

మాస శివరాత్రి  అంటే ఏమిటి?

 మాస శివరాత్రి అంటే ఏమిటి?

త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.

శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి

మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి

మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

ఈరోజు ఆరాధన వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఐశ్వర్య కారకుడు అయిన ఈశ్వరుని వల్ల ధనలాభం చేకూరుతుంది.

మొత్తం మీద శివరాత్రులు అయిదు రకాలు
1.
నిత్య శివరాత్రి, 2. పక్ష శివరాత్రి, 3. మాస శివరాత్రి, 4. యోగ శివరాత్రి, 5. మహా శివరాత్రి.

అన్ని శివరాత్రుల్లో మాస శివరాత్రి మహా శివరాత్రులు శివునికి ప్రీతి అయినవి ఈ రోజుల్లో శివాలయము సందర్శన, బిల్వ అర్చన, విభూతి, జల అభిషేకాలు మున్నగునవి చెప్పబడినవి. ఏ అభిషేకాలు చేయలేని వారు నిత్యం నిద్రకు ఉపక్రమించే ముందు పదకొండు సార్లు శివ శివ అనుకున్నా కూడా అది శివరాత్రితో సమం అవుతుంది అని పెద్దలు చెబుతారు.
చంద్రోమా మనస్సో జాతః

అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.

తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.

మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు ఘడియాలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంతమేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.

మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి.

అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఓం నమః శివాయ 

Products related to this article

Lord Shiva Brass Idol

Lord Shiva Brass Idol

Lord Shiva Brass Idol Lord shiva idol is made of Brass Metal. Height 7.5 Inchs Width5.5  Inchs Weight 250 Grams Terms and Conditions 1.The Image is of Orig..

$12.00

Lord Shiva Abhishekam On Masa Shivaratri

Lord Shiva Abhishekam On Masa Shivaratri

Benefits: Happiness at HomeSuccess in career and jobHarmony in relationship Removes planetary dosh Eliminates Financial problems Prasadam :Once completion of Abhishekam with the blessings of L..

$15.00