మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా | దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||
మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు.
పంపాకలశ ప్రతిష్ఠా
ఆచమ్య,
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ
శ్రీసువర్చలా సామెత హనుమద్వ్రత పూజాంగత్వేన పంపాపూజాం కరిష్యే అని నీటిని తాకాలి.
ముందుగా పంపాకలశ ప్రరిష్టాపన చేసి షోడశోపచారాలతో పంపాపూజ చేయాలి. పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దానిముందు ఐదు తమలపాకులు ఒకేరీతిగా పరిచి దానిపై వెండి, రాగి, లేదా కంచు పాత్ర ఉంచాలి. 'ఇమం మే వరుణ' మంత్రంతో ఆ పాత్రను నీళ్ళతో (పంపానదీ నీళ్ళతో) నింపాలి.
"ఇమం మే గంగా'' అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్ళను అభిమంత్రించాలి.
తరువాత
ఆ పంపాకలశంలో సువర్ణమౌక్తికలు ఉంచి గంధపుష్పాక్షతాలను, అష్టగంధ, కర్పూరాలు ఉంచి
'ఓం హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే తద్దేవతా కలశాయ నమః
అని ఆ కలశానికి నమస్కరించి నూతనవస్త్రం చుట్టి కలశానికి 'బృహత్సామ' మంత్రంతో రక్షాబంధనం చేయాలి.
పుష్పాక్షతలు తీసుకుని -
ఓం నమోభగవాతే అశేష తీర్థాలవాలే శివజటాదిరూఢే గంగే గంగాంబికే స్వాహా||
సర్వానందకరీ మశేషదురితధ్వంసీం మృగాంకప్రభాం
త్య్రక్షమూర్ద్వ కరద్వయేన దధతీం పాశం సృణీం చ క్రమాత్
దోర్భ్యాంచామృత పూర్ణకుంభ మవరే ముక్తాక్షమాలా ధరాం
గంగా సింధు సరిద్వరాది రచితాం శ్రీతీర్థశక్తిం భజే||
అని చేతులో ఉన్న పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించాలి.
తరువాత
పంపాకలశానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి.
పంపాకలశ స్థిత శ్రీ గంగా మహాదేవీ ఇహప్రాణ ఇహజీవ ఇహజీవ ఇహాగచ్చ|
సర్వేంద్రియాణి సుఖం చిరం తిష్టంతు స్వాహా||
స్థిరభవ వరదాభవ| సుముఖీభవ| సుప్రసన్నాభవ| ప్రసీద ప్రసీద ప్రసీద
అని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పంపాకలశ పూజ చేయాలి.
పూజ మీకు వచ్చిన విధంగా చేసుకోగలరు.
వ్రత కథ
శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కధ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో,