నాగసాధువులు ఎలా ప్రత్యక్ష మవుతారు?

నాగసాధువులు ఎలా ప్రత్యక్ష మవుతారు?

 కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్ష మవుతారు???

నాగసాధువులకి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం!!

హరిద్వార్ లోనూ,  త్రివేణి సంగమం లోనూ, ఉజ్జయిని లోను, నాసిక్ లోను జరిగే కుంభమేళా లలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీల్ల, పేపర్ లలో చూశాం.

నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు.

మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి.

ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.

కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్  ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా.

 ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా?

 

 ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా?

 ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే?

సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?

వీటన్నింటికీ సమాధానం ఒకటే!! వారు

 #అణిమాదిఅష్టసిద్ధులు_కలిగి_ఉంటారు!!

ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహా మహిమాన్విత సిద్ఘపురుషులు, యోగపురుషులు సూక్ష్మరూపాలలో సంచరిస్తూ ఉంటారని వారు మహాత్ములకే దర్శనమిస్తారు!

వారికి తెలియని విద్యలు లేవు!!

వారు దూదిపింజలవలె తేలిక కాగలరు!!

వారు పర్వతమంతా బరువు కాగలరు!!

అనేక తాంత్రికవిద్యలలో సిద్ధహస్తులు!!

1)అగ్నిస్థంభన,

2)వాయుస్థంభన,

3)జలస్థంభన విద్యలతో పాటు,

4)కాయస్థంభన,

5)వాక్ స్థంభన

6)పరకాయప్రవేశ విద్యలు,

7)ఈశిత్వ,

8)వశిత్వ,

9)వశీకరణ విద్యలు,

10)దూరదర్శన,

11)దూరశ్రవణాది

అనేకవిద్యలు వారికి కరతలామలకం!!

ఎంతో అవసరమేర్పడితే తప్ప వారు తమవిద్యలను బహిర్గతపరచరు!చాలా రహస్యంగా గోప్యంగా

ఏమి తెలియనట్లుగ ఉంటారు!!

 అందులో #సూక్ష్మశరీరయానం. ఒకభాగం!!

నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనంఇదే!! ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని కొందరు నమ్మరు!!

#నాగసాధువులుఅష్టసిద్ధులుకలిగిఉంటారా...??

అమోఘమైన, అధ్భుతమైన దివ్యశక్తులు, #యోగశక్తులు కలవారు #నాగసాధువులు!!

#అఘోరేభ్యోథఘోరేభ్యోఘోరఘోరథరేభ్యః!

#సర్వేభ్యోస్సర్వశర్వేభ్యోనమస్తేఅస్తురుద్రరూపేభ్యః!!

#ప్రయాగరాజ కుంభమేళాలో #షాహీస్నానం గావించిన సమస్త సాధుమండలికి సమస్త అఖాఢాల సాధువులకు అఘోరాసాధువులకు నాగసాధువులకు భక్తిహృదయపూర్వక పాదాభివందనాలు!!

 #హరహరమహాదేవ!!

#జయజయగంగే!! #హరహరగంగే!!

#కుంభమేళాలో  #నాగసాధువులు..

Products related to this article

Lord Balaji 16 Inches Wooden Handicraft - Kondapalli Bommalu

Lord Balaji 16 Inches Wooden Handicraft - Kondapalli Bommalu

Lord Balaji 16 Inches Wooden Handicraft - Kondapalli Bommalu..

$28.00

Go Seva

Go Seva

గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లేనని పురాణాలు చెపుతున్నాయి. గోవులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. మంచి సంతానం కలుగుతుంది. సులభంగా దైవానుగ్రహం లభి..

$8.00