మాఘమాసం - విశేష తిథులు

మాఘమాసం - విశేష తిథులు

మాఘమాసం - విశేష తిథులు

మాఘ విశిష్టతను గురించి....

 మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ  నవమి వరకు - శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీ.

 మాఘమాసంలో .....

 శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.

 శుద్ధ చవితి న ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితి నాడు చేసే తిలదానానికి, గొప్ప పుణ్యఫలం చెప్పారు.

 శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు.  ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతి కామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.

 శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.

 శుద్ధ సప్తమి ని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది.

 శుధ్ద అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం.

 శుధ్ద నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.  దీన్నే మధ్వనవమి అని అంటారు.

 శుధ్ద ఏకాదశి కి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు.

 శుధ్ద ద్వాదశి నాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు.

 శుధ్ద త్రయోదశి విశ్వ కర్మ జయంతి గా పేరు పొందింది.

 మాఘపూర్ణిమ కు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం, విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే....

 కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు.

కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి.

 

 కృష్ణ అష్టమి నాడు మంగళా వ్రతం చేస్తుంటారు.

 కృష్ణ ఏకాదశి ని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు.

 కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు.

 కృష్ణ త్రయోదశి ని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు.

కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు.

మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చెయ్యడం, అధిక ఫలప్రదమని పెద్దలంటారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాఘ మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

 సర్వే జనాః సుఖినోభవంతు

 సమస్త సన్మంగళాని భవంతు

 లోకాః సమస్తా సుఖినోభవంతు

Products related to this article

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

$18.00