నేడు హనుమత్ విజయోత్సవం

నేడు హనుమత్ విజయోత్సవం

నేడు హనుమత్ విజయోత్సవం 23/04/2024


హనుమంతుని జన్మ తిథి చైత్రమాసం లోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది

అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.

పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు.

అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు.

అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది.

ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది.

దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారు.

అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.

ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు.చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు.

ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు.

వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు.

హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది.

"కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి.

శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే

పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||

అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు.

ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు.

శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట.

మన హిందూ సమాజంలో జాడ్యం, బద్దకం, నిర్లిప్తత, తమస్సు మొదలైన గుణాలు పెరిగిపోయాయి. అవన్నీ వదలాలంటే, తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని వేడుకోవాలి.

అప్పుడే హిందువుల్లో చైతన్యం ఉట్టిపడుతుంది, జడత్వం నశిస్తుంది. కనుక సనాతన ధర్మ పునర్వైభం, భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి అనేవి సంకల్పాలుగా చేసుకుని, మనం కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు.

మన కోసం చేసిన పూజ కంటే, పదిమంది మేలు కోరి చేసింది, మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని ఇస్తుంది.

శ్రీరామదూతం శిరసా నమామి

Products related to this article

Hanuman Chalisa Yantram

Hanuman Chalisa Yantram

Hanuman Chalisa Yantram·         Hanuman Chalisa Yantra is made of premium quality metal. This helps it to last for a long period of time without getting dama..

$9.00

Hanuman Dollar (Silver )

Hanuman Dollar (Silver )

Hanuman Dollar (Silver )..

$4.00

999 Silver Hanuman Chalisa

999 Silver Hanuman Chalisa

Discover the divine beauty of the 999 silver Hanuman Chalisa pendant, a sacred religious item that symbolizes devotion and protection. Shop now for this exquisite piece of jewelry...

$3.75 $4.00

Hanuman Copper Locket

Hanuman Copper Locket

Discover the divine protection with our Hanuman Brass Locket. This sacred locket features an intricately crafted brass pendant of Lord Hanuman, symbolizing strength and devotion. Explore the spiritual..

$11.00