హనుమాన్ సర్వస్వం

 హనుమాన్ సర్వస్వం

జై శ్రీమన్నారాయణ హనుమాన్ సర్వస్వం

పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు.

1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?

జవాబు : అంజనా దేవి !

2) హనుమంతుని తండ్రి పేరు?

జవాబు : కేసరి !

3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?

జవాబు : కశ్యపుడు !

4) అంజన పూర్వ జన్మలో ఎవరు?

జవాబు : సాధ్య !

5) హనుమంతుని జన్మ తిథి ఏది?

జవాబు : వైశాఖ బహుళ దశమి!

6) హనుమంతుని జన్మ స్థలం ఏది?

జవాబు : తిరుమల - అంజనాద్రి.

7) హనుమంతుని నక్షత్రము ?

జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.

8) హనుమంతుని జనన లగ్నం ?

జవాబు : కర్కాటక.

9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?

జవాబు : వైదృవీయోగం లో

10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?

జవాబు : ఈశ్వరాంశ

11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?

జవాబు : వాయుదేవుని వరం వలన.

12)హనుమ జనన కారకులు ?

జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.

13) హనుమంతుని గురువు ?

జవాబు : సూర్య భగవానుడు.

14) హనుమంతుని శపించిన వారు ?

జవాబు : భృగుశిష్యులు.

15) హనుమంతునికి గల శాపం ?

జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.

16) హనుమంతుని శాప పరిహారం ?

జవాబు : స్తుతించినా,

నిందించినా తన శక్తి తను గ్రహించుట.

17) హనుమంతుని బార్య ?

జవాబు : సువర్చలా దేవి.

18) సువర్చాలా దేవి మాతామహుడు ?

జవాబు : విశ్వకర్మ.

19) హనుమంతుని మాతామహుడు ?

జవాబు : కుంజరుడు.

20)సువర్చల తల్లి పేరు ?

జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.

21) హనుమంతుని బావమరుదులు ?

: అశ్వనీ దేవతలు, శని,యముడు.

22) హనుమంతుని వివాహ తేదీ ?

: జేష్ఠ శుద్ధ దశమి.

23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?

: గౌతముడు , అహల్య.

24) హనుమంతుని మేన మామలు ?

: శతానందుడు, వాలి, సుగ్రీవులు.

25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?

: సుగ్రీవుని మంత్రి.

26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?

: ఋష్యమూక పర్వతం.

27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?

: భిక్షుక రూపం.

28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?

: పంపానదీ తీరం .

29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?

: శ్రీరాముడు.

30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?

: శ్రీరామ సుగ్రీవులకు.

31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?

: తల్లి అజ్ఞ.

32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?

: చందన వృక్ష శాఖ.

33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?

: శ్రీ పరాశర సంహిత.

34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?

: తార, రమ.

35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?

: పుష్యమి నక్షత్రం గల రోజు.

36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?

: దక్షిణ దిక్కు.

37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?

: ఆశ్లేష నక్షత్రం.

38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?

: స్వయంప్రభది.

39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?

: సంపాతి.

40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?

: మహేంద్ర పర్వతం.

41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?

: 100 యోజనాలు.

42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?

: మైనాకుడు.

43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?

: సముద్రుడు.

44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?

: రొమ్ము తో తాకాడు.

45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?

: చేతితో స్పృశించి.

46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?

: సురస.

47) సురస ఏ జాతి స్త్రీ ?

: నాగజాతి.

48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?

: ఉపాయంతో.

49) సురసను పంపిన దెవరు ?

: దేవతలు.

50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?

: హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .

51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?

: సింహిక.

52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?

: నీడ పట్టి లాగింది.

53) సింహిక వృత్తి ఎమిటి ?

: లంకను కాపాడడం.

54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?

: శ్రీ పరాశర మహర్షి చే.

55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?

: సువేల పర్వత ప్రాంతం లో.

56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?

: త్రికూటాచలం.

57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?

: సూర్యాస్తమయం కోసం.

58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?

: పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.

59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?

:లంకిణి

60) లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?

: ఎడమ చేతి పిడికిలి తో.

61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?

: ప్రాకారం దూకి

Products related to this article

999 Silver Foil Frame with Plastic Stand Big

999 Silver Foil Frame with Plastic Stand Big

Elevate your home decor with our exquisite 999 silver foil frame with a plastic stand.Silver Coated Foil Frame Dimensions:Height: 9 cmsWidth: 12 cms..

$4.00

999 Silver Hanuman Chalisa

999 Silver Hanuman Chalisa

Discover the divine beauty of the 999 silver Hanuman Chalisa pendant, a sacred religious item that symbolizes devotion and protection. Shop now for this exquisite piece of jewelry...

$3.75 $4.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

$18.00

999 Silver Ram Parivar

999 Silver Ram Parivar

Experience divine blessings with the exquisite 999 Silver Ram Parivar. Crafted with precision, this silver idol set depicts Lord Rama, Goddess Sita, Lord Lakshmana, and Lord Hanuman in intricate detai..

$11.00