ధనుర్మాసమంటే శూన్య మాసమా?

ధనుర్మాసమంటే శూన్య మాసమా?

ధనుర్మాసమంటే శూన్య మాసమా? శుభకార్యాలు చేయకూడదా?

కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని, చాలా మంది భావిస్తారు.

కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం, ఎంతో విశిష్టమైనది.

ఇప్పుడు ధనుర్మాసానికి ఎందుకంతటి విశిష్టత వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు చేయవచ్చా? ఈ మాసానికి శూన్య మాసమని ఎందుకు పేరు వచ్చింది? తదితర వివరాలను తెలుసుకుందాం.

ధనుర్మాసం అంటే?

డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశము అయిన కారణముగా, డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది.

ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయడం వల్ల; మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని "పండుగ నెల" అని అంటారు.

సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో, ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో, ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి "నెల పట్టడము" అంటారు.

కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి, ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

విష్ణు పూజ - బాలభోగం

ధనుర్మాసం విష్ణు పూజకు చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే, భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ధనుర్మాసంలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”.

ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే, గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం, మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్, రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళ కరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది.

ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత?

దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, పొంగల్ ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.

దారిద్య్రాన్ని దూరం చేసే లక్ష్మీ పూజ ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల, లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రం దూరమవుతుందని విశ్వాసం. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయటం వల్ల, మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణం చేసిన వారు, దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వ్రచనం.

ముగ్గులు - గొబ్బెమ్మలు

 

ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు వేకువ ఝామున, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల, మంచి జరుగుతుంది. ఆగమ శాస్త్రం ప్రకారం, ధనుర్మాసంలో నెలరోజుల పాటు వైష్ణవ ఆలయాలతో పాటు, తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ హరి దేవాలయాల్లో అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు.

ధనుర్మాస వ్రతం - మార్గళి

ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు, నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి "మార్గళి వ్రతం" పేరుతో, విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

కల్యాణ ప్రాప్తి

ధనుర్మాసంలో వివాహం కావాల్సిన అమ్మాయిలు, ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి, పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి, తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి, నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. ఇలా చేయడం వలన, వారికి కోరుకున్న వ్యక్తితో అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతీతి.

గోదాదేవి- కళ్యాణం

నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంచేస్తారు.

 

సహస్రనామార్చనలో తులసికి బదులు, బిల్వ పత్రాలతో పూజిస్తారు.  విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రులని కాక, శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి, నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని ఒక పద్యం, అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి, వాటిని విష్ణువుకు అంకితం చేసింది.  ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో, ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి, స్వామిలో అంతర్లీనమైపోతుంది.

ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ, భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే, ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి, ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి, మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు, ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం.

ఇంతటి విశిష్టమైన ధనుర్మాసాన్ని, విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకుందాం.!

Products related to this article

Sweets Seller

Sweets Seller

Experience the charm of traditional craftsmanship with Sweets Seller Kondapalli Toys - handmade toys depicting individuals engaged in the art of selling sweets. Explore the intricate craftsmanship and..

$15.00

Sankranthi Set

Sankranthi Set

Celebrate the joy of Sankranthi with Sankranthi Set Kondapalli Toys - handmade toys capturing the essence of the traditional Sankranthi festival. Explore the intricate craftsmanship and cultural signi..

$31.00

Snacks Making Lady

Snacks Making Lady

Experience the traditional artistry with Snacks Making Lady Kondapalli Toys - handmade toys depicting women engaged in the traditional activity of making snacks. Explore the intricate craftsmanship an..

$15.00