గిరిజా దేవి(బిరాజదేవి) శక్తిపీఠం
ఒడ్యాణం అంటే
ఓడ దేశం అని (ప్రస్తుత ఒరిస్సా రాష్టం).
ప్రస్తుత
ఒరిస్సా రాష్ట్రములోని
కటక్ నగరం సమీపంలోని వైతరణీనది ఒడ్డున గిరిజాదేవి అమ్మవారు
త్రిశక్తి స్వరూపిణిగా వెలసివుంది.
ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సాలోని జాజీపూర్ లో వుంది. ఈ జాజీపూర్ భువనేశ్వర్ కు సుమారు 100 కి.మీ. దూరంలో వుంది. ఈ ప్రదేశములో సతీదేవి నాభి స్థానం ఇక్కడ పడిందని అంటారు. ఈ అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠంగా 'ఒడ్యాణే గిరిజాదేవి' అని పేర్కొనబడింది.
అష్టాదశ శక్తి పీఠాల(18) వివరణ
18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. దీనికి ఒక పురాణగాథ వున్నది. దక్షప్రజాపతి, మహాయజ్ఞం సంకల్పించి ఆ కార్యకమానికి ఋషులను, మునులను దేవతలను, ఆహ్వానించి
కూతురినీ, అల్లుడినీ ఆహ్వానించలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (పార్వతి దేవి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంటుంది. అప్పుడు సతీదేవి (పార్వతి దేవి) తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ఆసక్తిపడుతుంది. పార్వతీ దేవి పుట్టింటివారు నన్ను ప్రత్యేకంగా పిలవాలేమిటి అని ఈశ్వరుడు చెప్పిన
వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని తన తండ్రి చేస్తున్న యజ్ఞస్థలానికి వెళుతుంది. అక్కడ దక్షప్రజాపతి సతి దేవిని అవమానించారు. ముఖ్యంగా శివానంద భరించలేక
అక్కడే ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఇది తెలుసుకున్న ఈశ్వరుడు
అక్కడికి వచ్చి రుద్రరూపంలో కాలభైరవుని సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. సతీ వియోగదుఃఖం తీరని పరమేశ్వరుడు
ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. అప్పుడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా ఛేదించి వానిని భూమిమీద పడేటట్లు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఉద్భవించాయని మనకు పురాణాలు తెలియచేస్తున్నాయి. సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలకు పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి.
గిరిజాదేవి ఆలయ వర్ణన
ఈ ప్రదేశములో సతీదేవి నాభి స్థానం ఇక్కడ పడిందని అంటారు.గిరిజాదేవి అమ్మవారిని ఇక్కడి స్థానికులు బిరిజాదేవి అని గిరిజా దేవిగా మరియు విరజాదేవి అనే పేర్లతో పిలుస్తారు. ఈ బిరిజ దేవి అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేటట్లు మిగతా అమ్మవారిని పూర్తిగా బంగారు ఆభరణాలతో మరియు పూలదండలతో అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మితవదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఈ అమ్మవారి విగ్రహమును రెండు చేతులు ఒక చేతిలో మహిసాసురుని రొమ్ము ఈటె గుచ్చుచూ రెండవ చేతితో మహిషాసురుని తోక గట్టిగా లాగుతూ ఒక కాలు సింహము పైననూ మరియొక కాలు మహిషాసురుని రొమ్ముపైన కలిగి ఉంటుంది. మహిసాసురుడు