లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు .

లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు .

లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమీయచ్చూర్.

తిరువారూర్ జిల్లాలో మైలాడుదురైకి 12 కి.మీ దూరంలో తిరుమీయచ్చూరు ఉంది. మైలాడుదురై నుంచి బస్సు సౌకర్యం ఉంది. పేరాలం నుంచి 2. కి.మీ, తిరువారూరు నుండి 25 కి.మీ, కుంభకోణం నుంచి 33 కి.మీ దూరంలో ఉన్న తిరుమీయచ్చూర్కి బస్సు లేదా టాక్సీలలో చేరుకోవచ్చు.తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తిరుమీయచ్చూర్లోని లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శివుని మందిరం ఆయుష్ హోమాలతో, అరవై, ఎనభై సంవత్సరాల వృద్ధుల జన్మదిన ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో, అర్చనలతో అలరారుతుంటుంది. దేవాలయ దర్శనం సర్వపాప ప్రక్షాళన గావిస్తుందంటారు. అంతేకాదు, ఇక్కడి స్వామిని ప్రార్థిస్తే పెళ్లికాని యువతులకు వెంటనే కళ్యాణప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్యరథసారధి అయిన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల నమ్మకం.

తిరుమీయచ్చూరు మరో ప్రత్యేకత ఏమంటే, దేవాలయంలో రెండు శివమూర్తులు, రెండు పార్వతీమూర్తులు పూజలందుకోవడం. విశేషం తమిళనాట తిరుమీయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన ఓసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన  సూర్యుడు శాపం నుంచివిముక్తి పొందాడని అంటారు. దాని గుర్తుగా గజవృష్ట వాహనంపై అధిష్ఠించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు. దేవాలయం కావేరీ దక్షిణ తీరంలోని 56 శివాలయంగా ఎంచబడింది. భక్తగ్రేసరుడైన జ్ఞానసంబందర్ తనతేవరమ్స్తోత్రాలతో ఇక్కడి పరమేశ్వరుని స్తుతించారు. తిరుమీయచ్చూర్ దేవాలయంలో శివ పూజలు, అభిషేకాలు, లలితాంబికకు అర్చనలు జరగడంతో పాటు ప్రత్యేకంగారథసప్తమిపండుగ గొప్పగా నిర్వహించబడుతుంది.