Benefits of Shiva Linga Abhishekam with...?

వివిధ పదార్థాలతో శివలింగాలను పూజిస్తే కలిగే ఫలితాలు ..?

 

శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వల్ల ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మీద పడకుండా ఉండడానికి శివలింగంపై ఎప్పుడూ నీళ్ళను పోస్తూ ఉండాలి. ఆ ధారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారా నిర్గుణబ్రహ్మను తెలుసుకుంటారు. 

  లింగాలు    ఫలితం

గంధ లింగం : రెండు భాగాల కస్తూరి, నాలుగు భాగాల గంధం, మూడు భాగాల కుంకుమ కలిపి లింగాన్ని చేసి పూజిస్తే

శివ సాయుజ్యం లభిస్తుంది.
పుష్పలింగం: వివిధ రకాల సుగంధ పుష్పాలతో లింగాన్ని చేసి పూజిస్తే రాజ్యాధిపత్యం లభిస్తుంది
నవనీతలింగం: ఈ లింగాన్ని వెన్నతో చేసి పూజిస్తే                                                     కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి

రాజోమయలింగం : ఈ లింగాన్ని పుప్పొడితో చేసి పూజిస్తే                                            

విద్యాధిరత్వం సిద్ధిస్తుంది,శివ సాయుజ్యాన్ని పొందుతారు

ధ్యానలింగం : యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో  లింగాన్ని చేసి పూజిస్తే   సంపదలవృద్ధి, సంతానం కలుగుతుంది
తిలిపిస్టోత్థలింగం : లింగాన్ని నూగుపిండితో చేసి పూజిస్తే ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది
లవణలింగం : హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి లింగాన్ని చేసి పూజిస్తే   వశీకరణ శక్తి లభిస్తుంది.
కర్పూరరాజ లింగం : ఈ లింగాన్ని పూజిస్తే  ముక్తిప్రదమైనది
భస్మమయలింగం : భాస్మంతో లింగాన్ని చేసి పూజిస్తే  సర్వసిద్ధులను కలగజేస్తుంది
శర్కరామయలింగం : ఈ లింగాన్ని పూజిస్తే        సుఖప్రదం ప్రాప్తిస్తుంది
సద్భోత్థలింగం : ఈ లింగాన్ని పూజిస్తే  ప్రీతిని కలిగిస్తుంది
పాలరాతి లింగం : ఈ లింగాన్ని పూజిస్తే    ఆయురాగ్యదాయకం
వంశాకురమయ లింగం: ఈ లింగాన్ని వెదురు మొలకలతో చేసి పూజిస్తే  వంశవృద్ధి కలుగుతుంది
కేశాస్థిలింగం : ఈ లిగాన్ని వెంట్రుకలు, ఎముకలతో చేసి పూజిస్తే            శత్రునాశనం చేస్తుంది
పిష్టమయలింగం : ఈ లింగాన్ని పిండితో చేసి పూజిస్తే సకల విద్యలను ప్రసాదిస్తుంది
దధిదుగ్థలింగం : ఈ లింగాన్ని పూజిస్తే    కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది
ఫలోత్థలింగం : ఈ లింగాన్ని పూజిస్తే  ఫలప్రదమైనది
ధాత్రిఫలజాతలింగం : ఈ లింగాన్ని పూజిస్తే   ముక్తిప్రదం

గోమయలింగం : కపిలగోవు పేడతో ఈ లింగాన్ని చేసి పూజిస్తే                              
(భూమిపై పడి మట్టితో కలిసిన పేడ పనికిరాదు)

ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది
దూర్వాకాండజలింగం : ఈ లింగాన్ని గరికతో చేసి పూజిస్తే  అపమృత్యుభయం తొలగిస్తుంది
వైడూర్య లింగం : ఈ లింగాన్ని పూజిస్తే            శత్రునాశనం, దృష్టిదోషహరం
ముక్తాలింగం : ఈ లింగాన్ని ముత్యాలతో చేసి పూజిస్తే   ఇష్టసిద్ధిని కలిగిస్తుంది
సువర్ణనిర్మితలింగం : లింగాన్ని బంగారంతో చేసి పూజిస్తే   ముకిని కలిగిస్తుంది
రజత లింగం : ఈ లింగాన్ని చేసి పూజిస్తే    సిరిసంపదలను కలిగిస్తుంది
ఇత్తడి (కంచు)లింగం : ఈ లింగాన్ని చేసి పూజిస్తే  ముక్తిని ప్రసాదిస్తుంది
ఇమును (సీసపు) లింగం : ఈ లింగాన్ని చేసి పూజిస్తే  శతృనాశనం చేస్తుంది
అష్టథాతు లింగం : ఈ లింగాన్ని చేసి పూజిస్తే   చర్మరోగాలను నివారిస్తుంది, సర్వసిద్ధిప్రదం
తుసశోత్థలింగం : ఈ లింగాన్ని చేసి పూజిస్తే   మారణక్రియకు పూజిస్తారు
స్ఫటికలింగం : ఈ లింగాన్ని పూజిస్తే  సర్వసిద్దికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం అవుతాయి
సీతఖండలింగం : ఈ లింగం పటికబెల్లంతో చేసి పూజిస్తే  ఆరోగ్య సిద్ధి కలుగుతుంది

 

0 Comments To "Benefits of Shiva Linga Abhishekam with...? "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!