Sri Lakshmi Venkateshwara Swamy Vari Brahmotsavam

Sri Lakshmi Venkateshwara Swamy Vari Brahmotsavam

జనవరి 29 నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 డిసెంబరు 21: కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

*బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :*

29-01-2025

ఉదయం – ధ్వజారోహణం,

రాత్రి – చంద్రప్రభ వాహనం.

30-01-2025

ఉదయం – సూర్యప్రభవాహనం,

రాత్రి – పెద్దశేష వాహనం.

31-01-2025

ఉదయం – చిన్నశేష వాహనం,

రాత్రి – సింహ వాహనం.

 

01-02-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం,

రాత్రి – హనుమంత వాహనం.

02-02-2025

ఉదయం – ముత్యపుపందిరి వాహనం,

రాత్రి – గరుడ వాహనం.

03-02-2025

ఉదయం – కల్యాణోత్సవం,

రాత్రి – గజవాహనం.

04-02-2025

ఉదయం – రథోత్సవం,

రాత్రి – ధూళి ఉత్సవం.

05-02-2025

ఉదయం – సర్వభూపాల వాహనం,

రాత్రి – అశ్వ వాహనం.

06-02-2025

ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం,

రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.

 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Products related to this article

Go Seva

Go Seva

గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లేనని పురాణాలు చెపుతున్నాయి. గోవులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. మంచి సంతానం కలుగుతుంది. సులభంగా దైవానుగ్రహం లభి..

$8.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

$18.00