కలియుగ వరదుడు అయ్యప్ప....!!

కలియుగ వరదుడు అయ్యప్ప....!!

కలియుగ వరదుడు అయ్యప్ప....!!

ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేసి తరించవచ్చని మన పెద్దలు చెప్పేరు.

భగవన్నామ స్మరణ చేయమని చెప్పడం సులువే కానీ ఏకాగ్రతతో, భక్తి తన్మయత్వంతో చేయడం అంత సులువైన పనికాదు.

మానవాళిలో భక్తితత్పరతను పెంచడానికి మన మహర్షులు పూజలు, భజనలు చేయమని, తరచు దేవాలయాలకు, పుణ్యతీర్ధాలకు వెళ్ళమని ఆదేశించారు.

దైవభక్తిని పెంపొదించడానికి కొన్ని రకాల దీక్షలను ప్రతిపాదించి, భక్తితో దీక్ష చేసి యాత్రలకు వెళ్ళమన్నారు.

దీక్షాకాలంలో పాటించవలసిన కొన్ని నియమాలను చెప్పి భక్తి శ్రద్ధలతో కనీసం మండలకాలం (41 రోజులు) దీక్ష చేసి యాత్రకు వెళ్ళి రమ్మన్నారు.

దీక్షలన్నిటిలో స్వామి అయ్యప్ప దీక్ష తలమానికమైనది. దీక్షా నియమావళి ఎంతో పవిత్రమైనదే కాకుండా ఆరోగ్యదాయకమైనది.

భక్తిచింతనతో పరవశించిపోతారు. అయ్యప్ప స్వామి దీక్ష చేయదలచిన వారు ముందుగా గురుస్వామి ద్వారా మెడలో తులసీమాలను కానీ రుద్రాక్ష మాలను కానీ ధరిస్తారు.

మాలకు అయ్యప్పస్వామి ప్రతిమ వున్న బిళ్ల తగిలించడం వలన దీనిని ముద్రమాలగా వ్యవహరిస్తారు. నలుపు లేక కాషాయం రంగు దుస్తులను దీక్షా వస్త్రాలుగా స్వీకరించి

 స్వామివారి ఎదుట దీక్షాకాలం 41 రోజులు నియమ నిష్టలు భక్తిశ్రద్ధలతో పాటించి ఇరుముడితో శబరిమల యాత్రకు వస్తామని ప్రతిజ్ఞచేసి మొక్కుకుంటారు.

మాలా ధారణ జరిగినది లగాయతూ ముఖ క్షవరం చేసుకోరు. తెల్లవారుజామున, సాయంత్రం పూట చన్నీటితో స్నానం చేసి నుదుట విభూది, చందనం, కుంకుమ అలంకరించుకొని దీపారాధన చేసి స్వామివారికి పూజ చేసి శరణాలు చెప్పుకుంటారు.

కాళ్ళకు చెప్పులు ధరించరు. పూజానంతరం ఏదో ఒక దేవాలయాన్ని దర్శిస్తారు. లేకుంటే భజన కార్యక్రమాలెక్కడున్నా వెళ్ళి భజనలో పాల్గొంటారు.

స్వామి దీక్ష చేసేవారు అసలిత బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై దిండులేకుండా చాపపైనే నిద్రిస్తారు. ఒక పూట భోజనం, రాత్రివేళ అల్పాహారం స్వీకరించి నిత్యం దైవనామ స్మరణం చేస్తూ వ్యావహారిక విషయాలకు దూరంగా ఉంటారు.

శుచిశుభ్రత పాటిస్తూ కాళ్ళు, చేతులు కడగనిదే ఇంట్లోకి కానీ. దేవాలయానికి కానీ వెళ్ళరు. దానధర్మాలు విరివిగా చేస్తారు.. అసత్యం పలుకరు. స్త్రీలనందర్నీ దేవతా స్వరూపులుగా భావించి గౌరవిస్తారు.

అర్ధాంగిని కూడా దీక్షా సమయంలో జగన్మాతగా తలచి ఆమె భక్తితో చేసే సేవలను స్వీకరిస్తారు. బ్రహ్మచర్య వ్రతం పాటించడం వలన వేరే గదిలో నిద్రిస్తూ, సజ్జన సాంగత్యంతో భక్తిని పెంపొందించుకొని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తారు.

మద్యమాంసాదులు సేవించడం, పొగత్రాగడం, తాంబూలం కూడా దీక్షాకాలంలో నిషేదమే.

దీక్షా నియమావళిని భక్తిశ్రద్ధలతో పాటించడం వలన మంచి క్రమశిక్షణ అలవడి, ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఒక సన్యాసి జీవితంలా గడపడం వలన.

 తెలియకుండానే శరీరంపై మమకారం తగ్గుతుంది. దీక్షలతో అంతస్తు, హెూదా అన్నీ మరచి లక్షాధికారులు, బిక్షాధికారులు కూడా కలసి ఒకేరకం దుస్తులు (నలుపు, కాషాయం) ధరించి భజనలు, పూజలు చేస్తూ సహపంక్తి భోజనాలు చేస్తారు.

గొప్ప, బీద తారతమ్యం కనిపించదు. స్వాములు ఒకరినొకరు ఎదురైనప్పుడు 'స్వామిశరణం' అని నమస్కరించుకొని పలుకరించు కుంటారు. కొందరు పాదాభివందనం కూడా చేయడానికి వెనుకాడరు.

మాల ధరించి దీక్ష చేస్తున్న స్వాము లందరూ అయ్యప్ప స్వామితో సమానంగా భావిస్తారు. తత్వమసి సిద్ధాంతం అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ.

తనలో అయ్యప్పస్వామిని దర్శిస్తూ ఎదుటివారిలో కూడా అయ్యప్పస్వామిని దర్శించడం ఈ దీక్షలో గొప్పతనం.

స్త్రీలకు 10 నుండి 50 సంవత్సరముల వయసు ఉన్నవారికి శబరిమల యాత్రకు అనుమతించరు.

పది సంవత్సరముల లోపు బాలికలు, యాభై పైపడి బహిష్టు ఆగిన స్త్రీలకే అయ్యప్ప దీక్ష, శబరిమల యాత్ర చేయడానికి అర్హత ఉంది.

కఠిన బ్రహ్మచర్యం, స్త్రీలకు బహిష్టు ఆటంకం వలన మండల కాలం దీక్ష సాగదని, అడవులలో, కొండలలో నడచి వెళ్ళే కష్టతరమైన యాత్రని స్త్రీలకు యాత్ర నిషేధించినట్లు కనిపిస్తుంది.

స్త్రీలు పవిత్రంగా శుచి శుభ్రత పాటిస్తూ పూజలు, భజనలలో పాల్గొని భక్తితో సేవలు చేసి తరించవచ్చు.

41 రోజులు దీక్ష పూర్తయ్యాక గురుస్వామి ఇరుముడి కట్టి తన వెంట శబరిమల యాత్రకు తీసుకువెళ్తారు.

ఇరుముడి అంటే రెండు గల సంచిలో ముందు భాగంలో స్వామివారికి పూజాద్రవ్యాలు, నెయ్యి నింపిన కొబ్బరికాయ (మకాయ)ను ఉంచుతారు.

సంచి వెనక భాగంలో ఆహారం పదార్థాలతో నింపి కట్టిన మూటనే ఇరుముడి అంటారు. ఇరుముడి తలపై లేనిదే శబరిమలలో 18 మెట్లు ఎక్కనివ్వరు.

మండల దీక్ష చేసి ఇరుముడితో వచ్చినవారికే 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకొనే భాగ్యం కలుగుతుంది.

అడవులలో కొండలపై తలపై ఇరుముడితో నడచి అయ్యప్పస్వామి దర్శించుకున్న వారి జన్మ తరిస్తుంది.

స్వామి శరణం! స్వామియే శరణమయ్యప్ప...

Products related to this article

999 Silver Foil Frame with Plastic Stand Big

999 Silver Foil Frame with Plastic Stand Big

Elevate your home decor with our exquisite 999 silver foil frame with a plastic stand.Silver Coated Foil Frame Dimensions:Height: 9 cmsWidth: 12 cms..

$4.00

999 Silver Foil Frame with Plastic Stand Mini

999 Silver Foil Frame with Plastic Stand Mini

Elevate your home decor with our exquisite silver-coated foil frame with a plastic stand.Silver Coated Foil Frame Dimensions:Height: 3.5 InchesWidth: 3.5 Inches..

$3.00

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

Get a 999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali, a sacred Hindu religious item with 108 names of Lord Narasimha engraved on it. A beautiful and spiritual piece for your collection...

$3.75 $4.00