మేషం:  నూతన వ్యాపార ప్రారంభం కోసం పెట్టుబడులను అన్వేషిస్తారు. నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ లో సభ్యత్వం తీసుకుంటారు దూరమైన సన్నిహిత వర్గం తిరిగి చేరువవుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.


వృషభం: ఆర్థిక ప్రణాళికలను క్రమపద్ధతిలో రూపొందించుకోగలుగుతారు. విదేశీయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవును.


మిథునం: ఎందుకో ఏమిటో తెలియని విధంగా ఎదుటివారు మీ మీద విమర్శల వర్షం కురిపిస్తారు. మీ యొక్క పలుకుబడిని ధనాన్ని ఉపయోగించి కొన్ని సమస్యలను రూపుమాపుకుంటారు.


కర్కాటకం: క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రజా జీవితంలో మీ స్థాయి మరింతగా పెరుగుతుంది. ఎవరు ఏ సహాయం అడిగినా కాదు అనకుండా సహకరిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.


సింహం: విజయాలు కార్యరూపంలో కనిపించిన అసహనంగా ఉంటారు. మొండిగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంట్లో శుభకార్యాల విషయమై కొద్దిపాటి వాదులాటలు జరిగే సూచన జాగ్రత్త వహించాలి.


కన్య: సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. రచనా వ్యాసంగాల పట్ల మక్కువ చూపుతారు. నూతన గృహం కొనుగోలు యత్నాలు ప్రారంభిస్తారు.


తుల: ప్రతి విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రజ్ఞా పాటవాలను కనబరిచి పనులను సానుకూలపరుచుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.


వృశ్చికం: పరపతి కలిగిన వారితోటి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజా సంబంధాలను విస్తృత పరుచుకుంటారు. మీ ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు.


ధనస్సు:  ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించగలుగుతారు. వాయిదా పద్ధతులలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి- ఉద్యోగాల పరంగా అధిక శ్రద్దను కనబరుస్తారు.


మకరం: జీవిత భాగస్వామితో సలహాలను సంప్రదింపులను సాగిస్తారు. సకాలంలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా కాకపోయినా ఒత్తిడి నుండి బయట పడతారు.


కుంభం: ఆత్మవిశ్వాసం, మనోధర్యం పెరుగుతాయి. ఆయాచితంగా కొన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి. పెట్టుబడులు స్థిరాస్తుల వ్యవహారాలు క్రమబద్ధీలో ఉంటాయి. పెద్దల పట్ల మీ బాధ్యతలను నెరవేరుస్తారు.


మీనం: మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఒకే సమయంలో అనేక కార్యక్రమాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం కొంత మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.



- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121