మేషం:  రాతపూర్వక ఒప్పందాలలో, ఆర్థిక వ్యవహారాలలో మధ్యవర్తిగా వ్యవహరించకపోవడం ఉత్తమం. ఓర్పును అధికంగా కనబరుస్తారు రుణాలు మంజూరు అవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.


వృషభం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


మిథునం: సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోని పదవులు అధిరోహించే సూచనలు గోచరిస్తున్నాయి.


కర్కాటకం: అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం.


సింహం: వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు.


కన్య: వృత్తి, ఉద్యోగ - వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీలో ధైర్యానికి మీరే ఆశ్చర్యపోతారు. వివాదాలకు దూరంగా ఉండండి.


తుల: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సంతానానికి నూతన సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి.


వృశ్చికం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్థి వివాదాలు తీరి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.


ధనస్సు:  పారిశ్రామిక, విద్యా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి.


మకరం: ఎంత కష్టపడినా ఫలితం నిదానంగా పొందుతారు. కొన్ని విషయాలలో నిదానంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో బంధువుల సహాయం పొందుతారు.


కుంభం: ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్న విధంగా ఉంటుంది.


మీనం: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన వ్యాపారాలు, చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు.



- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121