మేషం:  ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. పిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.


వృషభం: రాజకీయ రంగంలోని వారికి కొంత అనుకూలమైన కాలం. అన్ని విధాలుగా మీదే పైచేయిగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి- వ్యాపారాలను విస్తరిస్తారు.


మిథునం: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.


కర్కాటకం: పనులు నిదానంగా సాగుతాయి. చెల్లించవలసిన రుణాలకి ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరుగా ఉంటుంది. ఉపయుక్తం లేని వివాదాలు కాలహరణానికి కారణం అవుతాయి.


సింహం: విద్యారంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిష్కారమైన అసూయా ద్వేషాలు ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.


కన్య: క్షణం కూడా వృధా చేయకుండా కాలాన్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ అభిరుచికి తగిన విధంగా గృహాన్ని నిర్మించుకోవాలి అని ఆలోచనలో సఫలీకృతం అవుతారు.


తుల: జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. తగిన జాగ్రత్త వహించండి. శుభకార్య చర్చలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కనబరిచే ఓర్పు మంచి ఫలితాన్ని ఇస్తుంది.


వృశ్చికం: అతి ముఖ్యమైన పనులలో కొంత జాప్యం ఏర్పడిన చివరికి పై చేయి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.రుణ బాధలు తప్పవు. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.


ధనస్సు:  యోగ మెడిటేషన్ వంటి సనాతన ఆరోగ్య సూత్రాలు అవలంబిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందుల సూచన. క్రయక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.


మకరం: కీలక నిర్ణయాలలో మీ సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి. మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభకార్యాలు ఘనంగా చేయాలని సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.


కుంభం: ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు. ఖర్చు అధికంగా ఉన్నా సంతానపరమైన పురోభివృద్ధి బాగుంటుంది. మిత్రుల వలన మీకు మేలు జరుగుతుంది.


మీనం: కొంతమంది మీపై దుష్ప్రచారం చేస్తారు. మీ గుడ్ విల్ మాత్రం మీరు నిలుపుకుంటారు. వ్యాపార ప్రదేశంలో భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు చోటుచేసుకుంటాయి.



- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121