మేషం:  మేధస్సుకు పదును పెట్టి విద్యాపరంగా అభివృద్ధిని సాధిస్తారు. తాత్కాలిక అవసరాలకన్న భవిష్యత్తుకు, తత్ సంబంధిత విషయ వ్యవహారాలకు ప్రాముఖ్యతను ఇస్తారు.


వృషభం: వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ప్రత్యర్థులు పోటీదారుల నుండి ఊహించిన విధంగానే పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్తలు చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ జరగదు.


మిథునం: బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచన.


కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.


సింహం: సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి- వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


కన్య: నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. తేలికగా సాగుతాయి అనుకున్న కార్యక్రమాలు తప్ప క్లిష్టమైన నూతనమైన విషయ వ్యవహారాలు పరిగణలోనికి తీసుకోకండి.


తుల: వృత్తి ఉద్యోగాలపరంగా చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. రుణాలు లభిస్తాయి. సహోదర వర్గంతో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.


వృశ్చికం: ముఖ్యమని మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండటం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. రాజకీయాలకు వివాదాలకు అయినంత దూరంగా ఉంటారు. ఆనందంగా ఉండగలుగుతారు.


ధనస్సు:  నూతన పరిచయాలు పెరుగుతాయి. ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.


మకరం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆహ్లదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ఆనందం కలుగుతుంది.


కుంభం: వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. అప్పు చేయకపోవటమే పొదుపుకు తొలిమెట్టు అని దృఢనిశ్చయానికి వస్తారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు.


మీనం: అన్ని విషయాల్లోనూ చాలా నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తారు. శత్రువుల వ్యూహములను భంగం చేస్తారు అసాధ్యం అనుకున్న కార్యక్రమాలలో సైతం కొంత పురోభివృద్ధి సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తారు.



- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121