Satyanarayana Swamy Vrata vidanam

సత్యనారాయణస్వామి వ్రతం

వ్రత విధానం

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు. మధ్యాహ్న సమయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రిని అమర్చుకోవాలి. సాయంకాలం అంటే రాత్రి ప్రారంభం అవుతున్న సమయంలో సత్యనారాయణస్వామి వ్రతం చేయాలి. నేటి రోజులలో ఉపవాసం ఉండలేక ప్రతివారూ ఉదయాన్నే చేసేస్తున్నారు కానీ సాయంత్రం పూజ చేయడం శ్రేష్టమైనది.

సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :

పసుపు - 100గ్రా  కుంకుమ - 100గ్రా  గంధం - ఒక డబ్బా 
అగరవత్తులు - ఒక ప్యాకెట్  కర్పూరం - ఒక డబ్బా  తమలపాకులు - 100
నల్లవక్కలు - 100గ్రా  ఎండుకర్జూరం - 250గ్రా   పసుపుకొమ్ములు - 200గ్రా 
రూపాయి బిళ్ళలు - 65  బియ్యం - 2 ½ కేజీలు  అరటిపళ్ళు - డజను 
కొబ్బరికాయలు - ఏడు  ఐదు రకాల పండ్లు - రకానికి ఐదు  తెల్ల కండువాలు పెద్దవి
 ఒకటి జాకెట్ ముక్క  ఒకటి స్వామివారి ఫోటో విడిపువ్వులు - ¼ కేజీ
పూలమాలలు - శక్తి కొలది  వత్తులు నల్ల నువ్వుల నూనె,  అగ్గిపెట్టె
  ప్రసాదానికి  
బొంబాయి రావ్వి - 1 1/4కేజీ  పంచదార – 1/4కేజీ  జీడిపప్పు - 50గ్రా 
కిస్ మిస్ - 50గ్రా  యాలకుల పొడి - 50గ్రా పానకం 
చలిమిడి  వడపప్పు   మామిడి ఆకులు 
కలశం చెంబు ఏకహారతి పంచపాత్ర (రాగిది) ఉద్దరిణి (రాగిది)
అరివేణం (రాగిప్లేటు)  స్టీలు పళ్ళాలు - 2  గ్లాసులు - 3 
కొబ్బరినీళ్ళకు గిన్నె  పీటలు లేదా ఆసనాలు చేతిగుడ్డ  
  పంచామృతం కోసం  
ఆవుపాలు - ½లీ   ఆవుపెరుగు - 100గ్రా ఆవునెయ్యి - 200గ్రా    
తేనె - 50గ్రా  పంచదార - 100గ్రా  

 ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానసంధ్యలు పూర్తి చేసుకుని, స్వామివారిని మనసులో తలస్తూ 'ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణస్వామీ! నీ అనుగ్రహం కోరి భక్తిశ్రద్ధలతో నీ వ్రతాన్ని చేస్తున్నాను' అని సంకల్పించుకోవాలి. శుచి శుభ్రం అయిన ప్రదేశంలో గోమయంతో అలికి, ఐదు రకాల రంగుల పోడులతో ముగ్గులుపెట్టి, అక్కడ ఆసనం వేసి దానిపై కొత్త తెల్లని వస్త్రాన్ని పరవాలి. వస్త్రంపై బియ్యం పోసి, మధ్యలో కలశం పెట్టి దానిపై మళ్ళీ కొత్త వస్త్రం (జాకెట్టు ముక్క) ఉంచాలి. ఆ వస్త్రంపై సత్యనారాయణస్వామివారి ప్రతిమ లేదా చిత్రపటం ఉంచాలి. స్వామివారి మండపంలో బ్రహ్మాది పంచలోక పాలకులను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసి పూజించాలి. తరువాత కలశంలో సత్యనారాయణస్వామి వారిని ఆవాహన చేసి పూజించాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసుకుని

 శ్లో  శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!! 

ఆచమనం : ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః అని నీళ్ళను క్రిందికి వదిలిపెట్టాలి. నమస్కారం చేస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి.

ఓం గోవిందాయనమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూధనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్థనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః. ఆచమనం : ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః అని నీళ్ళను క్రిందికి వదిలిపెట్టాలి. నమస్కారం చేస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి. ఓం గోవిందాయనమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూధనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్థనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః.

సంకల్పం:  మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః ద్విదీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమంవంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్థక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి యోర్మద్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన్ వ్యావహారిక చాంద్రమానేన … సంవత్సరే … ఆయనే … మాసే … పక్షే … తిథౌ … వాసరే … శుభనక్షత్రే శుభయోగే శుభకరాణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః … నామధేయః … ధర్మపత్ని సమేతః శ్రీమతః … గోత్రస్య … నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివ్రుద్ధ్యార్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషఫలావ్యాప్త్యార్థం, చింతితమనోరథ సిద్ద్యర్థం, శ్రీ సత్యనారాయణముద్దిశ్య శ్రీ సత్యనారాయణ ప్రీత్యర్థం అనయాధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే, ఆదౌనిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీమహాగణపతి పూజాం కరిష్యే, తదంగ కలశారాధానం కరిష్యే.

కలశారాధన : కలశానికి గంధం, పసుపు-కుంకుమలు పెట్టి ఒక పుష్పం, కొద్దిగా అక్షితలు వేసి, కుడిచేతితో కలశాన్ని మూసి …

శ్లో కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః

మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్కృతాః

కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః

అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః

ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్థం దురితక్షయ కారకాః

శ్లో  గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే

సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశాపూజాః

అని చదువుతూ నీటిని దేవునిపై, పూజాద్రవ్యాలపై తమపై అంతటా చల్లాలి.

సత్యనారాయణస్వామి ప్రతిమను తమలపాకుపై ఉంచి …

పాలు: ఆప్యాయస్వసమేతుతే విశ్వతస్సోమ వృష్టియం, భవ వాజస్య సంగథే

పెరుగు: దదిక్రాపుణ్నో అకారిషం, జిష్ణోరశ్వస్యవాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయూగం తారిషత్

నెయ్యి: శుక్రమసి జ్యోతిరసి తెజోషి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః

తేనె: మధువతా ఋతాయతే మధుక్షరంతి సింధవః, మాధవీ ర్నస్సంత్వోషధీః

మధుసక్తముతోసి మధుమత్సార్థివగం రజః

మధుద్యౌరసునః పితా మధుమాన్నో వనస్పతి

ర్మదుమాగం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవన్తునః

శుద్దోదకం : స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే

స్వాదురింద్రాయ సుహేవేతు నామ్నే

స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే

బృహస్పతయే మధుమాంగం అదాభ్యః

శుద్ధోదకస్నానమ్ :

అపోహిష్టా మయోభువ స్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే

యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః

ఉషతీరివమాతరః తస్మా అరంగమామవో

యస్యక్షయాయ జిస్వథ ఆపోజనయథాచనః

ప్రాణప్రతిష్టాపన :

ఓం అస్యశ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయ, ఋగ్యజుస్సామాధర్వణాని ఛందాంసి ప్రాణశ్శక్తిః పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణపటిష్టాజాపే వినియోగః

కరన్యాసమ్ :

1) హ్రాం అంగుష్టాభ్యాం నమః 2) హ్రీం తర్జనీభ్యాం నమః  3) హ్రూం మధ్యమాభ్యాం నమః  4) హ్రౌం కనిష్టికాభ్యాం నమః 5) హ్రం కరతలకర పృష్టాభ్యాం నమః 6) హ్రైం అనామికాభ్యాం నమః

అంగన్యాసమ్ :

1) హ్రాం హృదయాయనమః 2) హ్రీం శిరసేస్వాహా 3) హ్రూం శిఖాయైవషట్ 4)  హ్రైం కవచాయహుం 5) హ్రౌం నేత్రత్రయాయ వౌషట్  6) హ్రః అస్త్రుయఫట్  8) భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానమ్ :

శ్లో  ధ్యాయోత్సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం

లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం

పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపడభూషితం

గోవిందం గోకులానందం బ్రహ్మద్వైరభిపూజితం

శ్రీసత్యనారాయణస్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి

ఆవాహనమ్ :

మం  ఓం సహస్రశీర్షాపురుషః సహస్రాక్షస్సహస్రపాత్స

భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట ద్దశాంగులమ్

శ్లో  జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థ మోంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం

సాంగం శక్తిం సాయుధం భక్తిస్వయం సర్వాకారం విష్ణుమావాహయామి

ఆసనమ్ :

మం.  ఓం పురుష ఏ వేదగం సర్వం, యద్భూతం యచ్చభవ్యం

ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి

శ్లో కల్పద్రుమూలే మణిమేదిమధ్యే సింహా సస్మ్ స్వర్ణమయం విచిత్రం

విచిత్రవస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత

శ్రీ సత్యనారాయణస్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

పాద్యమ్ :

మం  ఏతావానస్య మహిమా అతోజ్యాయాగ్శ్చ పూరుషః

పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామతందివి

నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక

పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్థయ

శ్రీ సత్యనారాయణస్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి.

అర్ఘ్యమ్ :

మం  త్రిపాదుర్ధ్వ ఉదైత్పురుషః పాదోస్యేహాభవాత్పునః

తతోవిష్పజ్వ్యక్రామత్ సాశనానశనే అభి

వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః

మయా నివేడితో భక్త్యా హ్యర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం

శ్రీసత్యనారాయణస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయమ్ :

మం  తస్మాద్విరాడజాయత విరాజో అధి పూరుషః

స జాతోత్యరిచ్యత పశ్చాద్భూమి మధోపురః

మందాకిన్యాస్తుయద్వారి సర్వపాపహరం శుభం

తదిదం కల్పితం దేవసమ్యగాచమ్యతాం విభో

శ్రీసత్యనారాయణస్వామినే నమః శుద్ధః ఆచమనీయం సమర్పయామి

స్నానమ్ :

మం  యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞ మతస్వత

వసంతో అస్యాసీ దాజ్యం గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః

శ్లో తీర్దోదకైః కాంచనకుంభసం స్థై

స్సువాసితై ర్దేవ కృపారసార్ద్రైః

మయార్పితం స్నానవిధిం గృహాణ

పాదాబ్జ నిష్ట్యూత నదీప్రవాహ

శ్రీసత్యనారాయణస్వామినే నమః స్నపయామి

పంచామృతం :

ఆప్యాయస్వ సమేతు తే విశ్వాత స్సోమ వృష్ణియం. భావా వాజస్య సంగదేః (పాలు) దధిక్రాపున్నో అకారిషం, జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రుణ ఆయాగంషి తారిషత్ః (పెరుగు) శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్చిద్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః (నెయ్యి) మధువాటా ఋతాయ తే మధుక్షరంతి సింధవః మాద్నీర్ణస్సంత్వోషధీః మధుసక్తముతోషి మధుమత్పార్ధివాగం రజః మధు ద్యౌరస్తు నః హితా, మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః (తేనె) స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే (శుద్దోదకం)

మధుమాగం అదాభ్యః : 

శ్లో  స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ

అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతిప్రియ

శ్రీసత్యనారాయణస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి

శుద్దోదకస్నానం :

అపోహిష్టా మయోభువ స్తానా ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే

యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః

ఉషతీరివమాతరః తస్మా అరంగమామవో

యస్యక్షయాయ జిస్వథ అపోజనయథాచనః

శ్లో నదీనాం చైవ సర్వాసా మాఈతం నిర్మలోదకం

స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర

శ్రీసత్యనారాయణస్వామినే నమః శుద్ధదకస్నానం సమర్పయామి

వస్త్రం :

మం  సప్తాస్యాసన్పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః

దేవాయద్యజ్ఞం తన్వానాః అబధ్నస్పురుషం పశుం

శ్లో  వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామ సమన్వితే

సర్వవర్ణ ప్రదే దేవ వాససీ తే వినిర్మితే

శ్రీసత్యనారాయణస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం :

మం తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షస్ పురుషం జాతమగ్రతః

తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే

శ్లో  బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం

గృహాణ భగవాన్ విష్టోసర్వేష్టఫలదో భవ

శ్రీసత్యనారాయణస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధమ్ :

మం  తస్మా ద్యజ్ఞా త్సర్వ హుతః సంభృతం వృషదాజ్యం

పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే

శ్లో  శ్రీఖండం చందనం దివ్యం గంధాడ్యం సుమనోహరం

విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం

శ్రీసత్యనారాయణస్వామినే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి

ఆభరణమ్ :

మం  తస్మాద్యజ్ఞా త్సర్వ హుతః ఋచస్సామినిజజ్ఞిరే

చందాగ్ సి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత

శ్లో హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః

సుహారం భూషణైర్ముక్తం గృహాణ పురుషోత్తమ

శ్రీసత్యనారాయణస్వామినే నమః ఆభరణం సమర్పయామి

పుష్పమ్ :

మం  తస్మాద్శ్వా అజాయంత యేకేచోభయా దతః

గావోహ జజ్ఞిరే తస్మాత్, తస్మా జ్ఞాతా అజావయః

శ్లో  మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో

మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం

శ్రీసత్యనారాయణస్వామినే నమః పుష్పాణి సమర్పయామి

ఆభరణమ్ :

మం  తస్మాద్యజ్ఞా త్సర్వ హుతః ఋచస్సామినిజజ్ఞిరే

చందాగ్ సి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత

శ్లో హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః

సుహారం భూషణైర్ముక్తం గృహాణ పురుషోత్తమ

శ్రీసత్యనారాయణస్వామినే నమః ఆభరణం సమర్పయామి

పుష్పమ్ :

మం  తస్మాద్శ్వా అజాయంత యేకేచోభయా దతః

గావోహ జజ్ఞిరే తస్మాత్, తస్మా జ్ఞాతా అజావయః

శ్లో  మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో

మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం

శ్రీసత్యనారాయణస్వామినే నమః పుష్పాణి సమర్పయామి

అథాంగ పూజ :

ఓం కేశవాయ నమః  పాదౌ పూజయామి
గోవిందాయ నమః    గుల్ఫౌ పూజయామి
ఇందిరాపతయే నమః జంఘే పూజయామి
అనఘాయ నమః జానునీ పూజయామి
జనార్థనాయ నమః  ఊరూ పూజయామి
విష్టరశ్రవసే నమః  కటిం పూజయామి 
కుక్షిస్థాఖిలభుఅవనాయ నమః  ఉదరం పూజయామి
 శంఖ్చక్రగదాశార్జ్గాపాణయే నమః  బాహూన్ పూజయామి 
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
పూర్ణేందు నిభవక్త్రాయ నమః   వక్త్రం పూజయామి
కుందకుట్మలదంతాయ నమః  దంతాన్ పూజయామి 
  నాసాగ్రమౌక్తికాయ నమః  నాసికాం పూజయామి 
 సూర్యచంద్రాగ్ని ధారిణే నమః  నేత్రే పూజయామి
సహస్రశిరసే నమః    శిరః పూజయామి

  శ్రీసత్యనారాయణస్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి

సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :

శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం 
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం 
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ  చతుర్థ అధ్యాయం
 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం 

 

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

Decorative Round Tray (Silver Colour)

Decorative Round Tray (Silver Colour)

Decorative Round Bowl(Silver Colour)..

$2.00

0 Comments To "Satyanarayana Swamy Vrata vidanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!