Thirupavai-Pashuram-8

తిరుప్పావై పాశురము - 8

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు

యేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగుళుమ్

పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై

కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ

పావాయ్! ఎళున్దిరాయ్ పాదిప్పరైకొన్డు

మావాయ్! పిళన్దానై మల్లరై మాట్టియ

దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్

ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

 

స్వామి సేవయండు ఆసక్తికల యువతిని మేల్కొల్పడం .

 

యువతీ! మేల్కొనవే! తూర్పున ఆకాశం తెల్లబడింది. పచ్చికబయళ్ళలో మంచుచే కప్పబడిన పచ్చికను మేస్తూ పశువులు స్వేచ్చగా తిరుగాడుతున్నాయి. స్వామివారిని దర్శించే కోరికతో నిన్ను లేపకుండానే వెళ్ళేవారిని దారిలోనే ఆపివుంచి నిన్ను పిలుచుటకై మేము వచ్చి నిలిచివున్నాము. శ్రీ కృష్ణుని సేవయందు ఆసక్తికల సుందరాంగీ మేలుకో! మేలుకొని మాతో కలిసి పూజకు రావలసినది. దాణూర ముష్టికులనే పేరుగల మల్లవీరులను మట్టుపెట్టి విలసిల్లు విష్ణుమూర్తిని జేరి పరిపరి విధముల పరమగానములతో కీర్తించినచో స్వామి అయ్యో వీరు ఇందరు వచ్చినారే అని అత్యంత కరుణతో మనలను అనుగ్రహిస్తాడు. కనుక గోపికా! మేలుకొని వ్రతాచరణకు మమ్ము అనుసరించవమ్మా!

Products related to this article

Azurite Bracelet

Azurite Bracelet

                                                        &nbs..

$22.00

Howlite Bracelet

Howlite Bracelet

It often used to help one, two recognize the impact of their own actions and behavior. It also brings mental awareness and facilitates calm communication.         ..

$22.00

0 Comments To "Thirupavai-Pashuram-8"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!