తిరుప్పావై పాశురము - 7
కీశు కీశెన్రెజ్గుమాని దాత్తకన్దు!
పేశిన పీచ్చరవం కేట్టిలైయో! పెయ్ ప్పెణ్నే!
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో
నాయకపెణ్ణిళ్ళాయ్! నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేష ముడైయాయ్! తిర వేలో రెమ్బావాయ్
నోము విషయం తెలిసీ నిద్రిస్తున్న నాయకిని మేల్కొల్పడం
ఓ యువతీ! మాకు నాయకివై, నోము నోచు విషయం అంతా తెలిసీ ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరం! ఇంకా తెల్లవారనే లేదంటావా! భలేదానివే! అదిగో భరద్వాజ జంటపక్షులు రాత్రి అంతా కలిసివుండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమని రోదచేయడం నీకు వినపడలేదా! పోనీలే, ఓ చిన్నదానా! గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుట నీకు కనపడకపోవచ్చు. చిలుకునప్పుడు వారి మెడలో మంగళసూత్రంలోని రెండు తాళిబొట్లు, కాసులపేరులు రాచుకొని కలిగే చప్పుల్లు, చేతిగాజుల గలగలలు నీ చెవికి వినపడనేలేదా! మజ్జిగ చిలికేటప్పటి చిర్రుబుర్రుమనే మనోహర శబ్ధమైనా వీనుల విందుగా వినగారాలేదా! మాకు నాయకివైన చిన్నదానా! పరందాముడైన, సర్వార్థసాధకుడైన శ్రీ కేశవస్వామిని స్తుతిస్తూ పరమగానం చేస్తుండగా నీవు వింటూ కూడా నిదురలో ఉన్నావా! ఇకనైనా వేగిరమే మేలుకో! మనమంతా వ్రతమాచారించాలిగదా!
Note: HTML is not translated!