తిరుప్పావై పాశురము - 1
మార్గళి త్తింగళ్ మది నిరైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ ముల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాల్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఎరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్ పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
చెలియల్లారా! రండి రారండీ! సంపత్కరములయిన సర్వాభరణములతో విరాజిల్లుతున్న ఓ గోపికన్నియలారా రండీ రారండీ! ఈ రోజు పవిత్రమయిన మార్గశిరమాసం. అందులోను పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉన్న వేకువజాము. పోటుమగాడిన నాధుని అనుంగుబిడ్డను సేవింతమురారే! నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోదముద్దుపట్టి అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తిదీర సర్వశుభములు పొందుటకు ఈ వేకువన చన్నీట జల్లులాడి సేవించుటకుపోవుదము రారే! ఇది మన వ్రతం కదా!
Note: HTML is not translated!