What are to be donated daywise donation in Karthika Masam

కార్తీక మాసంలో ఏ ఏ  రోజు ఏమి దానం చేస్తే బాగుంటుంది?


కార్తీకంలో ప్రతి రోజు అమూల్యమైనదే !! కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో మాత్రం అది కొద్దిమందికే తెలుస్తుంది. అందరికీ కార్తీక శుభదినాలను ఎలా ని ర్వహించుకోవాలి, ఏం చేయాలి, దేన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయో వేద పండితులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందామా..

♦ మొదటి రోజు : నెయ్యి, బంగారం.
♦ రెండవ రోజు : కలువపూలు, నూనె, ఉప్పు.
♦ మూడో రోజు : తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. ఉప్పు దానం చేయడం శుభప్రదం. ఫలితంగా శక్తి, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి.
♦ నాలుగో రోజు : కార్తీకశుద్ధ చవితి. నాగులచవితిని పురస్కరించుకుని వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. నూనె, పెసరపప్పు, దానం ఇవ్వాలి. సద్భుద్ది, కార్యసిద్ధి సాధ్యమవుతుంది.
♦ ఐదో రోజు : ఈ రోజును జ్ఞానపంచమి అంటారు. ఆదిశేషుని పూజించాలి. ఫలితంగా కీర్తి లభిస్తుంది.
♦ ఆరో రోజు : షష్టి రోజున బ్రహ్మచారికి ఎర్ర గళ్ళకండువా దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు.
♦ ఏడో రోజు : సప్తమి రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రని వస్త్రంలో గోధుమలు దానం చేయాలి. దీంతో ఆయుష్సు వృద్ధి చెందుతుంది.
♦ ఎనిమిదో రోజు : అష్టమినాడు గోపూజ చేస్తే విశేష ఫలితాలు ఇస్తుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది.
♦ తొమ్మిదో రోజు : నవమినాటి నుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఫలితంగా ఆత్మరక్షణ, సంతాన రక్షణ ఉంటుంది.
♦ పదో రోజు : విష్ణువుని పూజించాలి. స్వయంపాకం, నూనె దానాలు ఆచరించాలి. దీంతో కీర్తి, ధన లాభం కలుగుతుంది.
♦ 11వ రోజు : ఈ ఏకాదశికే బోదనైకాదశి అని పేరు ఉంది. ఈ రోజు శివుడు, విష్ణువుని పూజిస్తే ధనప్రాప్తి, పదవీ యోగం కలుగుతుంది.
♦ 12వ రోజు : దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఉసిరి, తులసి మొక్కల వద్ద దామోదరుడిని ఉంచి పూజించి దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగుతాయి.
♦ 13వ రోజు : పువ్వులు దానం చేయాలి. వనభోజనాలు పెట్టుకోవడం మంచిది. మన్మథుడిని పూజించడంతో వీర్యవృద్ధి, సంతానవృద్ధి, సౌందర్యవృద్ధి కలుగుతుంది.

♦ 14వ రోజు : పాషాణ చతుర్దశి వ్రతం చేస్తారు. దున్నపోతు, లేకుంటే గేదెను దానం చేస్తారు. యముడిని పూజించడంతో అకాల మృత్యువులు తొలగుతాయి.
♦ 15వ రోజు : కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానమాచరించి శివాలయాల వద్ద జ్వాలాతోరణం వెలిగించాలి. సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. చంద్రుడిని పూజించడంతో మనశ్శాంతి కలుగుతుంది.
♦ 16వ రోజు : కార్తీక బహుళపాడ్యమి. ఈ రోజున స్వథాగ్నిని పూజించాలి. ఆకుకూరలు దానం చేయాలి. ఫలితంగా పవిత్రత చేకూరుతుంది.
♦ 17వ రోజు : విదియ రోజున ఆశ్వనీదేవతను పూజిస్తారు. ఔషధాలు దానం చేయాలి. వనసమారాధన చేస్తారు. ఫలితంగా సర్వవ్యాధి నివారణ సాధ్యమవుతుంది.
♦ 18వ రోజు : తదియ రోజున పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించాలి. వారి చల్లనిచూపులు ప్రసరించి తెలివితేటలు వృద్ధి చెందుతాయి.
♦ 19వ రోజు : చవితినాడు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించాలి. ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే విఘ్నాలు తొలగుతాయి.
♦ 20వ రోజు : పంచమిరోజున నాగేంద్రునికి పూజలు చేయాలి. చీమలకు నూకలు చల్లడం, కుక్కలకు అన్నం పెట్టడంలాంటివి చేయడంతో సంతానవృద్ధికలుగుతుంది.
♦ 21వ రోజు : షష్టినాడు గ్రామదేవతలకు పూజచేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
♦ 22వ రోజు : సప్తమినాడు జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి.
♦ 23వ రోజు : అష్టమినాడు కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవాలకు వేస్తే ధనప్రాప్తి సిద్ధిస్తుంది.
♦ 24వ రోజు : నవమినాడు శ్రీ దుర్గను పూజించి వెండి లేదా రాగితో చేసిన కలశంలో నీరు పోసి పండితులకు దానం చేయడంతో పితృదేవతలు తరిస్తారు.
♦ 25వ రోజు : దశమిరోజున అన్నసంతర్పణలు చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి.
♦ 26వ రోజు : ఏకాదశి రోజున కుబేరుడిని పూజిస్తారు. వైష్ణవ ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ, విశేష ఫలితాలు ఇస్తాయి.
♦ 27వ రోజు : ద్వాదశి పర్వదినాన కార్తీక దామోదరుడిని పూజించాలి. అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించాలి. ఫలితంగా మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి లభిస్తాయి.
♦ 28వ రోజు : త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన మంచిది. దీంతో గ్రహదోషాలు తొలగుతాయి.
♦ 29వ రోజు : చదుర్దశి మాసశివరాత్రి నాడు ఈశ్వరార్చన, అభిషేకం చేస్తే అపమృత్య దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి.
♦ 30వ రోజు : అమావాస్యనాడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు, పప్పుతో కూడిన సమస్త పదర్ధాలను దానం చేయాలి. దీని వల్ల పెద్దలకు నరకబాధలు తొలగుతాయి. స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయి.

Products related to this article

Ashta Lakshmi  Shatagopam (Silver Coated)

Ashta Lakshmi Shatagopam (Silver Coated)

Ashta Lakshmi  Shatagopam (Silver Coated)..

$25.00

Brundhavanam Vattulu

Brundhavanam Vattulu

Brundhavanam Vattulu..

$2.00

0 Comments To "What are to be donated daywise donation in Karthika Masam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!