Balipadyami

బలిపాడ్యమి :

కార్తీక శుక్ల పాడ్యమి రోజుని బలిపాడ్యమిగా జరుపుకుంటారు. బలిచక్రవర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి దీనికి బలిపాడ్యమి అనే పేరు ఏర్పడింది. ప్రహ్లాదుని మునిమవడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి దేవాంబ, విరోచనుల కుమారుడు, భార్య ఆశన.

అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసభగవానుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరుశురాముడు ఈ ఏడుగురూ చిరంజీవులు. బలిచక్రవర్తి రాక్షసుడు అయినా మహాభక్తుడు, దానధర్మాలకు పెట్టింది పేరు. బలిచక్రవర్తి దేవతలను, ఇంద్రుడిని ఓడించి దేవలోకాధిపతి అయ్యాడు. ఇంద్రుడు విష్ణుమూర్తి శరణుకోరగా అప్పుడు విష్ణుమూర్తి వామనుడి అవతారంలో (దశావతారాలలో ఐదవ అవతారం), బలిచక్రవర్తి భృగుకచ్చమనే చోట అశ్వమేథ యజ్ఞం చేస్తున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు వాముడు.

వామనుడి బ్రహ్మతేజస్సు, దివ్య యశస్సులతో వెలిగిపోతూ, చేతులలో దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి ఒక రకమైన రెల్లుగడ్డితో మొలత్రాడు, యజ్ఞోపవీతం ధరించి, శరీరంపై జంతుచర్మం, శిరస్సుపై జడలు ధరించి బ్రాహ్మణ రూపంలో యజ్ఞమండపంలోకి ప్రవేశించాడు. వామనుడిని చూసిన బలిచక్రవర్తి ముగ్ధుడై ఆసనంపై ఆసీనుడిని చేసి పూజించాడు. వామనుడు 'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు ...' అంటూ బలిచక్రవర్తిని ఆశీర్వదించాడు. వామనుడి దీవెనలకు బలిచక్రవర్తి సంతృప్తి చెంది, ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు వామనుడు తనకు కేవలం మూడు అడుగుల భూమిని ఇవ్వమని కోరుకున్నాడు. బలిచక్రవర్తి భూమిని దానం చేయడానికి సిద్ధపడుతుండగా, రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు. అయినా బలిచక్రవర్తి, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. వామనుడు విరాట్ రూపాన్ని సంతరించుకుని ఒక పాదంతో భూమినీ, మరొక పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడవ పదం బలి శిరస్సుపై ఉంచి అతన్ని పాతాళలోకంలోకి అణగద్రొక్కాడు. బలిచక్రవర్తి యొక్క దాన గుణానికి సంతుష్ఠుడు అయిన వామనుడు, బలిచక్రవర్తిని సుతలలోకాన్ని అనుగ్రహించాడు, సంవత్సరానికి ఒక్కసారి కార్తీక శుక్ల పాడ్యమి రోజున పాతాళం నుండి భూలోకానికి రావచ్చు అని వరం ప్రసాదించాడు. 

Products related to this article

Ashta Lakshmi  Shatagopam (Silver Coated)

Ashta Lakshmi Shatagopam (Silver Coated)

Ashta Lakshmi  Shatagopam (Silver Coated)..

$25.00

0 Comments To "Balipadyami"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!