Intructions to Kanakadhara stotram reciters

కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు ...

♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ రెండు సార్లు పఠించినంతనే నిరుపేదలైనా కుబేరులుగా మారతారు. అటువంటి కనకధారా స్తోత్రం పఠించే వారు కొన్ని సూచనలను పాఠించాలి.

♦ కనకధారా స్తోత్రాన్ని ఉత్తర ముఖంగా ఉండి పఠించాలి.

♦ మహాలక్ష్మీదేవి పటాన్ని కానీ మహాలక్ష్మీ యంత్రాన్ని కానీ ఎదురుగా పెట్టుకుని పారాయణ చేయాలి

♦ ప్రతి రోజూ ఉదయం 6:00 నుండి 7:00 గంటల మధ్య, సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య పారాయణ చేయాలి.

♦ కనకధారా స్తోత్రాన్ని పూర్ణిమ తిథి లేదా పౌర్ణమి రోజున ఉపదేశం పొందాలి

♦ కనకధారా స్తోత్ర పారాయణకు వయసు లింగ భేదాలు లేవు.

♦ ఎటువంటి కారణంతో అయినా పూజ చేసే సమయాలలో నలుపు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజించకూడదు

♦ ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయకూడదు

♦ పట్టువస్త్రం లేదా ఎరుపు, నలుపు లేని వస్త్రాలను ధరించి శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠించి కులదేవతకు పూజ చేస్తే ఋణ బాధలు ఉండవు, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందుతారు.

♦ మగవాళ్ళు ప్రతి రోజూ శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే అసలు అప్పులపాలు అవరు. 

Products related to this article

Chandravadana Herbal Face Wash Powder

Chandravadana Herbal Face Wash Powder

Chandravadana(Chandravadana Herbal Face Wash Powder) This herbal face wash powder makes your face more beauty Swathi Herbals-Srisailam Chandravadana A Herbal face wash powder A perfect blend of best h..

$2.50

Silver & Gold Plated Brass Bowl Flower Carving 4" Diameter Bowl With Spoon

Silver & Gold Plated Brass Bowl Flower Carving 4" Diameter Bowl With Spoon

Silver & Gold Plated Brass Bowl Flower Carving 4" Diameter Bowl With Spoon..

$10.00

0 Comments To "Intructions to Kanakadhara stotram reciters "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!