What-Naivedyams-offered-to-gods-goddesses

దేవీ దేవతలకు నివేదించవలసిన నైవేద్యాలు?

హిందువులు ప్రతిరోజూ దేవీదేవతలకు పూజ చేసిన తరువాత నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు ఎవరికీ ఎటువంటి నైవేద్యం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వారికోసమే ఈ వివరణ ...

విఘ్నేశ్వరుడు : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యంగా సమర్పించి, శ్వేత అంటే తెల్లని అక్షతలతో పూజించాలి.

శ్రీ వేంకటేశ్వర స్వామి : వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి తులసిమాల మెడలో వేయాలి.

ఆంజనేయస్వామి : అప్పాలు నైవేద్యం సమర్పించి, తమలపాకులతో, సింధూరంతో అలంకరించి పూజించాలి.

సత్యనారాయణ స్వామి : ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపిన ప్రసాదం నైవేద్యంగా నివేదించాలి.

పరమేశ్వరుడు : కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి, మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

శ్రీకృష్ణుడు :అటుకులతో కూడిన తీపిపదార్థాలు, వెన్న నైవేద్యంగా సమర్పించి, తులసి దళాలతో పూజించడం ఉత్తమం.

షిరిడీ సాయిబాబా : పాలు, గోధుమరొట్టెలు, ఉడకబెట్టిన శెనగలు, రవ్వకేసరి  నైవేద్యంగా సమర్పించాలి.

సూర్యుడు : మొక్కపెసలు, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి.

లక్ష్మీదేవి : క్షీరాన్నం, తీపిపళ్ళు నైవేద్యంగా నివేదించి తామరపువ్వులతో పూజించాలి.

లలితాదేవి : క్షీరాన్నం, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి.

దుర్గాదేవి : మినపగారెలు, అల్లం ముక్కలు నైవేద్యంగా నివేదించాలి.

సంతోషిమాత : పులుపులేని పిండివంటలు, తేపిపదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి.

ఈ విధంగా దేవీ దేవతలకు నైవేద్యాలు సమర్పించి వారి ఆశీర్వాదాలు పొందగలరు.

Products related to this article

Silver Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 3.5" Diameter & Tray 9.5" x 5.5")

Silver Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 3.5" Diameter & Tray 9.5" x 5.5")

Silver & Gold Plated Shaped  Brass Bowl Set 5 Pcs. (Bowls 3.5" Diameter & Tray 9.5" x 5.5")..

$11.00

Silver & Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 4" Diameter & Tray 10" x 8")

Silver & Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 4" Diameter & Tray 10" x 8")

Silver & Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 4" Diameter & Tray 10" x 8") ..

$14.00

0 Comments To "What-Naivedyams-offered-to-gods-goddesses"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!